News February 14, 2025
సీఎం రేవంత్ రెడ్డి LOVE STORY మీకు తెలుసా..?

పడవలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డారు మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇంటర్ చదివే రోజుల్లో నాగార్జునసాగర్ వెళ్లిన రేవంత్‌కు పడవలోనే గీతారెడ్డిని చూసి మనసు పారేసుకున్నారు. ఇంకేముంది.. పరిచయం కాస్త స్నేహంగా.. స్నేహం కాస్త ప్రేమగా మారింది. రేవంత్ రెడ్డి గీతారెడ్డి తరఫున వారి ఇంట్లో మాట్లాడి ప్రేమను గెలిపించుకున్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో 1992లో ఒక్కటయ్యారు.
Similar News
News January 12, 2026
బీర సాగుకు అనువైన విత్తన రకాలు

బీర పంటలో మంచి దిగుబడి రావాలంటే విత్తన ఎంపిక ముఖ్యం. భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ రూపొందించిన అర్క సుజాత, అర్క ప్రసన్న, అర్క సుమిత్, అర్క విక్రమ్ వంటి రకాలతో పాటు.. సురేఖ, సంజీవని, మహిమ, ఎన్.ఎస్-3(NS-3), ఎన్.ఎస్.401 (NS-401), ఎన్.ఎస్.403 (NS-403), అర్జున్, లతిక, మల్లిక, నాగ వంటి హైబ్రిడ్ రకాలతో మంచి దిగుబడులను సాధించవచ్చు. మీ ప్రాంతాన్ని బట్టి నిపుణుల సూచనలతో వీటిలో రకాలను ఎంపిక చేసుకోవాలి.
News January 12, 2026
కర్కాటకము వర్షిస్తే కాడిమోకు తడవదు

సాధారణంగా కర్కాటక కార్తెలో వర్షాలు చాలా వేగంగా, కుండపోతగా కాకుండా కేవలం తుంపర్లుగా లేదా చాలా తక్కువ సమయంలోనే కురిసి ఆగిపోతుంటాయి. ‘కాడి’ అంటే ఎడ్ల మెడపై వేసే చెక్క, ‘మోకు’ అంటే దానికి కట్టే బలమైన తాడు. కర్కాటక కార్తెలో వర్షం ఎంత తక్కువగా కురుస్తుందంటే, కనీసం పొలంలో పని చేసే ఎడ్ల కాడికి ఉన్న ఆ తాడు కూడా పూర్తిగా తడవనంత తక్కువగా ఉంటుందని దీని అర్థం. ఈ వర్షం వల్ల ప్రయోజనం ఉండదని భావం.
News January 12, 2026
కర్నూలు: ‘పోలీసులనూ నడిరోడ్డుపై నడిపించండి’

చట్టం ముందు అందరూ సమానులే. ఇటీవల కొన్ని ఘటనల్లో నిందితులను పోలీసులు రోడ్లపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. తప్పులు ఎవరూ చేయకూడదనే సంకేతాలు జనాల్లోకి తీసుకెళ్లేందుకే ఇలా చేశామంటూ వారు చెప్పుకొస్తున్నారు. పోలీసులు తప్పు చేస్తే రాజీ చేయడం, వీఆర్‌కు పంపడం లేదా సస్పెండ్ చేయడమేనా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో నలుగురు కర్నూలు పోలీసులు <<18825569>>వీఆర్<<>>కు వెళ్లిన విషయం తెలిసిందే.


