News February 14, 2025
యలమంచిలి : లారీ ఢీకొని మహిళ మృతి

లారీ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన యలమంచిలి ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం.. తాడిగరువుతోటకు చెందిన విజయ నడుచుకుని వెళ్తుండగా.. కొబ్బరిలోడు లారీ ఆమెను ఢీకొంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె ముగ్గురు కుమార్తెలకు వివాహమైంది. భర్త ఇటీవల మృతి చెందినట్లు సమాచారం.
Similar News
News January 12, 2026
ఒకేరోజు 7 చిత్రాల ట్రైలర్స్ విడుదల చేస్తా: నిర్మాత తుమ్మలపల్లి

ఈ ఏడాది ఆగస్టు 15 లోపు 15 చిత్రాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. సోమవారం భీమవరంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఒకేసారి ప్రారంభించిన 15 చిత్రాలలో ఇప్పటికే 7 చిత్రాల షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. భీమవరం టాకీస్ పతాకంపై రూపొందిన ఈ 7చిత్రాల ట్రైలర్లను కూడా ఒకేరోజు ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు.
News January 12, 2026
ప.గో: అర్జీదారులకు గమనిక.. గ్రీవెన్స్ వేదిక మార్పు

ప్రతి సోమవారం గొల్లలకోడేరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. అర్జీల స్వీకరణ కార్యక్రమం గొల్లలకోడేరు కార్యాలయానికి బదులుగా భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరగనుంది. గొల్లలకోడేరు కార్యాలయానికి రావాల్సిన అర్జీదారులు నేరుగా వన్‌టౌన్ స్టేషన్‌కు వచ్చి తమ వినతులు అందజేయాలని ఎస్పీ ఒక ప్రకటనలో కోరారు.
News January 12, 2026
ప.గో జిల్లాలో సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్

భీమవరం కలెక్టరేట్, జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


