News February 14, 2025

వాలంటైన్స్‌ డే.. మన రాజనర్సింహ లవ్ స్టోరీ

image

FEB 14 ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. అలాంటి ప్రేమకు సెలబ్రిటీలు, ప్రజలే కాదు.. మన రాజకీయ నాయకులూ బందీలే. మంత్రి, ఆందోల్ MLA దామోదర రాజనర్సింహ, పద్మినీరెడ్డి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లో నిజామాబాద్‌లో మిత్రుడి పెళ్లికి వెళ్లి అక్కడ పద్మినీతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. స్నేహితుల సహాయంతో 1985లో ఇద్దరూ పెళ్లి చేసుకోగా ఇరు కుటుంబాల పెద్దలు ఆశీర్వదించారు.

Similar News

News December 28, 2025

ఐబొమ్మ రవి కేసులో ఆసక్తికర పరిణామం

image

TG: ప్రహ్లాద్ పేరిట ఐబొమ్మ రవికి పాన్‌, డ్రైవింగ్ లైసెన్స్ ఉండటంపై పోలీసులు ఆరా తీశారు. అతడు తన రూమ్‌మేట్ అని గతంలో రవి చెప్పారు. దీంతో బెంగళూరు నుంచి ఇవాళ ప్రహ్లాద్‌ను పిలిపించి రవి ఎదుటే ప్రశ్నించారు. అయితే రవి ఎవరో తనకు తెలియదని, తన పేరుతో పాన్, లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్ అయ్యానని ప్రహ్లాద్ చెప్పినట్లు తెలుస్తోంది. అతడి డాక్యుమెంట్లను రవి దొంగిలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

News December 28, 2025

WGL: రేపు కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’

image

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఉ.10.30 గంటలకు ప్రారంభం కానుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలను నేరుగా అధికారులకు అందించొచ్చన్నారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ వివరించారు.

News December 28, 2025

కడప: ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న ఉల్లి రైతులు.!

image

నష్టపోయిన ఉల్లి రైతుకు క్వింటాల్‌కు రూ.20ల చొప్పున ప్రభుత్వం సాయం ప్రకటించింది. కడప జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 11,628 ఎకరాల్లో రైతులు ఉల్లి పంటను సాగు చేశారు. వీరపునాయునిపల్లె, మైదుకూరు, దువ్వూరు, వేముల, తొండూరు, వేంపల్లె, ముద్దనూరు మండలాల్లో రైతులు ఉల్లి పంట సాగు చేశారు. పంట చేతికొచ్చిన సమయంలో మార్కెట్లో ధర లేదు. రైతులు పెట్టుబడులు పెట్టి నష్టపోయారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.