News February 14, 2025
NZB: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

NZB జిల్లా బాల్కొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. HYDలోని చింతల్‌కు చెందిన రమేశ్, చంద్రశేఖర్, సాయివిశాల్, శ్రీనివాస్, రజినీకాంత్, సంపత్ కారులో కుంభమేళా వెళ్తున్నారు. చిట్టాపూర్ వద్ద లారీని ఓవర్టేక్ చేస్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. సంపత్ అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News January 26, 2026
NZB: రూ.8.68 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు

గత 15 నెలలుగా పెండింగ్‌లో ఉన్న మాధవ్ నగర్ ఆర్ఓబీ 193ను సవరించిన అదనంగా రూ.8.68 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి కోరారు. R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. తక్షణమే మంజూరు ఉత్తర్వులను జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News January 26, 2026
బోధన్: గుర్తుతెలియని కూలీ మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ఆరా

బోధన్ రూరల్ PS పరిధిలో గుర్తుతెలియని అడ్డా కూలీ మృతి చెందాడు. సాలంపాడ్ గ్రామానికి చెందిన వ్యక్తి నాని అనే కూలీని పనికి తీసుకెళ్లగా, పని అనంతరం అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సదరు కూలీ మరణించాడు. మృతుడు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాడని తెలుస్తోంది. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే బోధన్ రూరల్ ఎస్సై 87126 59872 నంబరుకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
News January 26, 2026
దేశసేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రజలు అందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశసేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపేందుకు అందరు సహకారం అందించాలన్నారు.


