News March 20, 2024
రికార్డు స్థాయికి మారుతి సుజుకీ షేర్లు!

వాహన తయారీ సంస్థ మారుతి సుజుకీ షేర్లు ఈరోజు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 3శాతం మేర పెరిగిన షేర్ విలువ తొలిసారిగా ఈరోజు రూ.12వేల మార్కును టచ్ చేసింది. మధ్యాహ్నం 12.44 గంటల సమయానికి షేర్ వాల్యూ 3.14శాతం పెరిగింది. షేర్ విలువ చివరి ఐదు ట్రేడింగ్ సెషన్లలో 5శాతం, గడచిన 6 నెలల్లో 15.5శాతం, గడచిన ఏడాదిలో 45శాతం పెరగడం విశేషం.
Similar News
News September 9, 2025
ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో అప్రెంటీస్‌లు

DRDOకు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్-చాందీపూర్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్‌లు పోస్టులు 32, డిప్లొమా అప్రెంటీస్‌లు 22 ఉన్నాయి. దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్‌సైట్: https://drdo.gov.in/
News September 9, 2025
రేపటి నుంచే పీఈసెట్ కౌన్సెలింగ్

AP PECET(వ్యాయామ విద్య) కౌన్సెలింగ్ రేపటినుంచి జరగనుంది. విద్యార్థులు ఈ నెల 13వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 11 నుంచి 14వరకు, కాలేజీల వెబ్ ఆప్షన్ల నమోదు 14నుంచి 16వరకు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు ఎడిట్ ఈ నెల 17న అవకాశం ఇచ్చారు. ఈ నెల 19న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 22, 23 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
News September 9, 2025
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 95 పోస్టులు

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 95 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లైకి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 24. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.