News February 14, 2025
ఎన్నికల్లో ఉద్యోగుల సహకారం కీలకం: కలెక్టర్

ఎన్నికల్లో నిర్వహించిన ఉద్యోగుల సహకారం కీలకమని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వల్లూరు క్రాంతిని టీఎన్జీవో నాయకులు గురువారం కలిశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు తమ వంతు సహకారం అందిస్తామని కలెక్టర్‌కు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ, కార్యదర్శి రవి పాల్గొన్నారు.
Similar News
News November 9, 2025
రేపు ఎనుమాముల మార్కెట్ OPEN

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. రేపు తిరిగి ప్రారంభం కానుండగా రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News November 9, 2025
రేపు, ఎల్లుండి కేంద్ర బృందం పర్యటన.. సీఎంతో భేటీ!

AP: రేపు, ఎల్లుండి రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. రెండు బృందాలుగా ఏర్పడి పరిశీలించనుంది. రేపు టీం-1: ప్రకాశం, టీం-2 కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో నష్టాలను అంచనా వేయనుంది. ఎల్లుండి టీం-1: బాపట్ల, టీం-2: కోనసీమ జిల్లాల్లో పర్యటించనుంది. ఈ కేంద్ర బృందం మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం ఉందని APSDMA తెలిపింది.
News November 9, 2025
లారీ ఢీకొని యువకుడు మృతి

బైక్‌పై వెళుతున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన భట్టిప్రోలు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివయ్య వివరాల మేరకు.. రేపల్లె – గూడవల్లికి బైక్‌పై వెళ్తున్న మహమ్మద్ వలి (27) ని అదే దారిలో వస్తున్న లారీ సూరేపల్లి బ్రిడ్జి వద్ద ఢీకొట్టింది. ఈ ఘటనలో వలి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.


