News February 14, 2025
నాదెండ్ల: విద్యార్థిని బలవర్మరణం.. కేసు నమోదు

నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన 16 సంవత్సరాల విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకొని బలవణ్మరణానికి పాల్పడింది. నరసరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితులతో కలిసి కోటప్పకొండ వెళ్లిన విద్యార్థినిని ఉపాధ్యాయులు మందలించటంతో మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుంది.
Similar News
News September 15, 2025
నంద్యాల: పోలీసుల గ్రీవెన్స్ డేకు 105 ఫిర్యాదులు

నంద్యాలలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సోమవారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 105 అర్జీలు అందజేశారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. చట్ట పరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సిబ్బందిని ఆదేశించారు.
News September 15, 2025
PDPL: ‘SC వర్గీకరణ అమలులో పాలకుల కుట్ర’

SC వర్గీకరణ అమలులో పాలకుల కుట్ర ఆగలేదని, దీంతో మాలలకు అన్యాయం జరిగిందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీటింగ్ లో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మద్దెల నర్సయ్య పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మాలలు వ్యతిరేకం కాదని, సామాజిక న్యాయం జరగటం లేదన్నారు. రోస్టర్ విధానం వల్ల SUలో 33 గెస్ట్ లెక్చరర్ పోస్టులు ఒక్కటి కూడా రాలేదన్నారు.
News September 15, 2025
ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం దారుణం: జగన్

AP: 1923 – 2019 వరకు రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలుంటే, తమ హయాంలో 17 కాలేజీలను సంకల్పించామని YCP చీఫ్ జగన్ అన్నారు. ‘2023 SEP 15న VZM, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ప్రారంభించాం. పాడేరు, పులివెందుల కళాశాలలను అడ్మిషన్లకు సిద్ధం చేశాం. మిగతా కాలేజీల పనులు చేయకుండా వాటిని ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం దారుణం. ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలి’ అని ట్వీట్ చేశారు.