News March 20, 2024
నరసరావుపేట టీడీపీ టికెట్‌పై రగడ

నరసరావుపేట TDPలో టికెట్ రగడ కొనసాగుతోంది. నేడు అధిష్ఠానం మూడో జాబితా విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో YCP నేత జంగా కృష్ణమూర్తిని TDPలో చేర్చుకొని ఆయనకు టికెట్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. నరసరావుపేటలో ఎప్పటి నుంచో పార్టీని కాపాడుతున్న అరవింద్ బాబుకే టికెట్ ఇవ్వాలని మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ రామిరెడ్డి ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.
Similar News
News October 24, 2025
గుంటూరు డీఈవోపై ఎమ్మెల్సీ ఆలపాటి ఆగ్రహం

గుంటూరు జిల్లాలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో తాజాగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. గేమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను ముద్రించారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరుకు బదులు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేరును ముద్రించారు. దీంతో డీఈవో రేణుక తీరుపై ఎమ్మెల్సీ ఆలపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
News October 24, 2025
చిచ్చర పిడుగు.. 17 ఏళ్లకే ప్రపంచ మేధావిగా గుర్తింపు

పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడి కరెక్ట్‌గా సూటవుతుంది ఈ కుర్రాడికి. 4 ఏళ్ల వయసులో కంప్యూటర్‌పై పట్టు సాధించి 12 ఏళ్లకే డేటా సైంటిస్ట్, 17 ఏళ్లకి Ai ఇంజినీర్‌గా రాణిస్తూ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు. అతడే ఆసియాలోనే యంగెస్ట్ డేటా సైంటిస్ట్ పిల్లి సిద్ధార్ద్ శ్రీ వాత్సవ. తెనాలి ఐతానగర్‌కు చెందిన ప్రియమానస, రాజకుమార్ దంపతుల కుమారుడైన సిద్ధార్ద్ నేడు టోరీ రేడియో లైవ్ ఈవెంట్‌లో పాల్గొంటున్నాడు.
News October 24, 2025
సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన కల్పించాలి: ఎస్పీ

ప్రజలకు సైబర్ నేరాలు, మోసాల పట్ల అవగాహన కల్పించాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రామ/ వార్డు మహిళా పోలీసులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా పోలీసులు తమ పరిధిలోని ప్రజలతో మమేకమై సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. అనంతరం సైబర్ భద్రతా పోస్టర్లు, అవగాహన బ్రోచర్లను ఆయన విడుదల చేశారు.


