News February 14, 2025

మంత్రి గన్‌మెన్‌ వెంకటరమణను సస్పెండ్ చేసిన ఎస్పీ

image

రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న జి.వెంకటరమణను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సస్పెండ్ చేశారు. వెంకటరమణ ఇటీవల సాలూరు నుంచి విజయనగరం వస్తుండగా బుల్లెట్ మ్యాగ్జైన్‌తో ఉన్న బ్యాగ్ మిస్ అయ్యింది. దీంతో ఆయన విజయనగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News September 15, 2025

కేసులు పెట్టినా వెనక్కి తగ్గం: మత్స్యకారులు

image

బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. మమ్మల్ని ఉరితీసి చంపడంటూ మత్స్యకారులు నినాదాలు చేస్తున్నారు. కేసులు పెట్టినా భయపడేది లేదని వారు స్పష్టం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

News September 15, 2025

రుషికొండ: సముద్రంలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

image

రుషికొండ బీచ్‌లో ఆదివారం సాయంత్రం గల్లంతైన ఇద్దరి యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పీఎం పాలెం ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థులు సంజయ్, సాయి శ్యామ్ మరో ఇద్దరు బీచ్‌లో స్నానం చేస్తుండగా గల్లంతయ్యారు. ఇద్దరిని పోలీస్ గార్డ్స్ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పీఎం పాలెం సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా సోమవారం ఉదయం సంజయ్, సాయి శ్యామ్ మృతదేహాలు లభ్యమయ్యాయి.

News September 15, 2025

అనకాపల్లి: కాక రేపుతున్న బల్క్ డ్రగ్ పార్క్

image

అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కాక రేపుతోంది. నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోయే ఈ ఇండస్ట్రీని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసన తెలిపిన 13 మందిపై నిన్న కేసులు కూడా నమోదయ్యాయి. గతంలో ఈ పార్క్‌ను తూ.గో జిల్లాలో ఏర్పాటు చేయాలని చూడగా అక్కడ అడ్డుకున్నారని మత్స్యకారులు అంటున్నారు. దీంతో మత్స్య సంపద నాశనం అవుతుందని, తమ ఉనికే దెబ్బతింటుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.