News February 14, 2025

సూర్యాపేట: ఖండాలు దాటిన ప్రేమ

image

ఉద్యోగం చేస్తూ వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఖండాలు వేరైనా ఒకరినొకరు ఇష్టపడ్డారు. NLG(D) దాచారం గ్రామానికి చెందిన సందీప్‌ ఉన్నత చదువుల కోసం పదేళ్లక్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తిచేసి టెక్సాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పనిచేస్తున్నాడు. ఈక్రమంలో అదే కంపెనీలో మేజేజర్‌గా పనిచేస్తున్న అమెరికా యువతి అవని ఏలేనాతో ప్రేమలోపడ్డాడు. ఈనెల 7న ఘట్కేసర్‌లో వీరి వివాహ జరిగింది.

Similar News

News July 5, 2025

యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

image

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా రేపు గిరిప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.

News July 5, 2025

విశాఖ గోల్డ్ వ్యాపారులకు హెచ్చరిక

image

విశాఖలో ఆభరణాల వ్యాపారులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (B.I.S.) హాల్ మార్కింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. నిబంధనలు గురించి ఆభరణాల వ్యాపారులకు వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చిక్కుడు తప్పవని B.I.S. దక్షిణ ప్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ ఖన్నా హెచ్చరించారు. B.I.S. కేర్ మొబైల్ యాప్ గురించి వివరించారు.‌ విశాఖ నుంచి 100 మంది గోల్డ్ వ్యాపారులు హాజరయ్యారు.

News July 5, 2025

సూర్యాపేట: చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

image

చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెంలో ఈరోజు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బస్టాండ్ వద్ద కాసాని నాగేశ్వరరావు వేపచెట్టు కొమ్మలు నరుకుతుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడ్డాడు. తీవ్ర గాయాలవగా మెరుగైన చికిత్స నిమిత్తం అతడిని ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.