News February 14, 2025

PPM: సంజీవయ్య ప్రేరణతో ముందుకు సాగాలి

image

దామోదరం సంజీవయ్య స్పూర్తి, ప్రేరణతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. దామోదరం సంజీవయ్య జయంతిని  వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని దామోదరం సంజీవయ్య చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలను వేసి నివాళులర్పించారు.

Similar News

News January 1, 2026

HYD: మెట్రోపై సర్కార్ స్టడీ.. టెక్నికల్ కమిటీల ఏర్పాటు

image

HYD మెట్రో సర్కారు చేతుల్లోకి రానున్న దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైల్ నిర్వహణ ఎలా ఉండాలనే విషయంపై అధికారులు సమాలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్‌ను స్టడీ (అధ్యయనం) చేసేందుకు 2 టెక్నికల్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ (ఇన్‌ఛార్జి) సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఈ కమిటీలు మెట్రోను పరిశీలించి త్వరలో నివేదిక సమర్పిస్తాయన్నారు.

News January 1, 2026

భారత్ అందరిదీ.. RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

image

డెహ్రాడూన్‌లో త్రిపుర విద్యార్థిపై జరిగిన జాతివివక్ష దాడి నేపథ్యంలో RSS చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశం అందరిది. కులమతాలు, భాష, ప్రాంతం ఆధారంగా ఎవరినీ తక్కువ చేయొద్దు’ అని ఆయన పిలుపునిచ్చారు. విభజన భావాలను వీడి సమానత్వంతో మెలగాలని ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన సభలో సూచించారు. దాడిలో చనిపోయిన విద్యార్థి ఏంజల్ చక్మా మృతి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సామాజిక సామరస్యం అవసరమని గుర్తుచేశారు.

News January 1, 2026

బాపట్ల: ఈ-ఆటో వాహనాల ప్రారంభం

image

పర్యావరణ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గురువారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాకు కేటాయించిన ఈ-ఆటోలు వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. మొదటి విడతగా ఎనిమిది ఆటోలు జిల్లాకు మంజూరైనట్లు వెల్లడించారు. ఎలక్ట్రికల్ ఆటోల ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వ్యయం తగ్గుతుందని పేర్కొన్నారు.