News February 14, 2025

వడ్డేపల్లి: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

image

వడ్డేపల్లి మండలంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని జులకల్ స్టేజ్‌లో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం మేరకు.. వెంకట్ రాములు కుమారుడు భాను ప్రకాశ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.యువకుడి మృతితో గ్రామంలో తీవ్ర విషాదాఛాయాలు అలుముకున్నాయి. కాగా, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News November 15, 2025

ఉండవెల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలు

image

ఉండవెల్లి మండల పరిధిలోని పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో కోళ్ల వ్యాన్ బోల్తా పడి ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా డ్రైవర్ హుస్సేన్ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ డివైడర్‌ను ఢీకొనడంతో వాహనం బోల్తా పడింది. దీంతో హుస్సేన్‌తో పాటు క్లీనర్ మాలిక్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. బ్లూ కోట్ వీధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

News November 15, 2025

అన్నమయ్య: విద్యుత్ శాఖలో ఎస్‌ఈ బాధ్యతలు చేపట్టిన సోమశేఖర్ రెడ్డి

image

శనివారం అన్నమయ్య జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆపరేషన్‌గా సోమశేఖర్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈయన నెల్లూరులో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పని చేశారు. అన్ని డివిజన్ల ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు, యూనియన్లు శుభాకాంక్షలు తెలిపారు. సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడం ముఖ్య బాధ్యతన్నారు. అన్ని విభాగాలు డిస్కం స్థాయిలో ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలన్నారు.

News November 15, 2025

పార్టీ పరంగా 50% రిజర్వేషన్లకు ఖర్గే గ్రీన్ సిగ్నల్?

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై మరో ముందడుగు పడింది. పార్టీ పరంగా BCలకు 50% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీకి వెళ్లిన CM రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, PCC చీఫ్ మహేశ్ ఈ విషయాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అటు ఎల్లుండి జరిగే క్యాబినెట్‌లో రిజర్వేషన్లపై చర్చించనున్నారు.