News February 14, 2025

మైలవరం: తండ్రిని కడతేర్చిన కొడుకు 

image

మైలవరం మండలం మెర్సుమల్లి గ్రామ సమీపంలోని ములకలపెంట, మొక్కజొన్న తోటలో గత శనివారం రాత్రి కడియం శ్రీనివాసరావు అనే వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. కొడుకే తండ్రిని కడతేర్చినట్లు తెలిపారు. చేసిన నేరం నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడన్నారు. ఇన్వెస్టిగేషన్ అనంతరం శుక్రవారం నాడు ముద్దాయిని కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Similar News

News July 6, 2025

రాజమండ్రి : ప్రయాణికులకు గమనిక

image

ఆషాఢ మాసం సందర్భంగా రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లే ఇంద్ర ఏ.సీ బస్సు ధరలో 15% రాయితీ కల్పించినట్లు ఆర్టీసీ డీఎం కె.మాధవ తెలిపారు. నేడు ఆయన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. రాజమండ్రి – హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ తక్కువ ధరకు ఇంద్ర ఏ.సీ బస్సులో ప్రయాణించ వచ్చుని అన్నారు.ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రస్తుత టిక్కెటు ధర రూ.1060లు కాగా రాయితీపై ధర రూ.920గా ఉందని చెప్పారు.

News July 6, 2025

JNTUలో కౌన్సెలింగ్.. విద్యార్థులకు కీలక సూచన

image

TG EAPCET 2025లో భాగంగా ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి సంబంధించి అధికారులు మరో కీలక సూచన చేశారు. కౌన్సెలింగ్ పూర్తయిన విద్యార్థులు సాయంత్రం 4 గంటల నుంచి వెబ్ ఆప్షన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ మంగళవారం సాయంత్రం వరకు కొనసాగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు.

News July 6, 2025

భీమా సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలి: కలెక్టర్

image

పీఎం జీవన జ్యోతి, సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పధకాల ద్వారా భీమా పొందాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అతి తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ రక్షణ పొందవచ్చన్నారు. భీమా పథకాలపై సచివాలయాల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సామాన్య కుటుంబాలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు.