News February 14, 2025

UPDATE: అక్కంప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్‌లో మృతి చెందిన కోళ్లు

image

పీఏపల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో మృతి చెందిన కోళ్లను గుర్తుతెలియని వ్యక్తులు పడేసిన విషయం తెలిసిందే. శుక్రవారం రిజర్వాయర్‌ను దేవరకొండ RDO రమణారెడ్డి పరిశీలించారు. రిజర్వాయర్ వెనక జలాలలో దాదాపు 80 కోళ్లు లభ్యం అయ్యాయి. రిజర్వాయర్‌లో కోళ్లను ఎవరు ప‌డేసి ఉంటారో అనే కోణంలో విచారణ చేపడుతున్నామని ఆర్డీఓ చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై ఎవ‌రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.

Similar News

News September 18, 2025

జగిత్యాల: ఉపాధ్యాయ సర్వీసు రూల్స్ సాధన కోసం కృషి

image

JGTLలో ఎస్టీయూ, TS జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సర్వీసు రూల్స్ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. అర్హులైన ఉపాధ్యాయులకు MEO, Dy EO, డైట్, జూనియర్ లెక్చరర్ పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. PRC నివేదిక బహిర్గతం ఆలస్యం సరికాదని విమర్శించారు. ఎస్టీయూ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

News September 18, 2025

మంచిర్యాల: ‘పట్టు పురుగుల పెంపకాన్ని ప్రోత్సహించాలి’

image

ఆదివాసీల అభివృద్ధికి, పట్టు పురుగుల పెంపకానికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లాలో పట్టు పురుగుల పెంపకంపై సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. నాయక్ పోడు హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న, జిల్లా అధ్యక్షుడు పెద్ది భార్గవ్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు శేఖర్, రైతులు తదితరులు ఉన్నారు.

News September 18, 2025

జూబ్లీ బైపోల్.. ఢిల్లీలో పైరవీలు!

image

TG: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్‌ కోసం ఢిల్లీలో భారీ లాబీయింగ్ జరుగుతోంది. ముఖ్యంగా దానం నాగేందర్ ఢిల్లీతో పాటు బెంగళూరుకు చక్కర్లు కొడుతున్నారు. హస్తిన నేతలతో పాటు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడిని కలిసి బీఫాం కోరారని తెలుస్తోంది. అటు ఢిల్లీకి వెళ్లిన CM రేవంత్‌తో ఖర్గే తనయుడు ఈ అంశంపై కాసేపటి క్రితం భేటీ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఖర్గేతో రేపు ఉదయం రేవంత్ సమావేశం కానున్నారు.