News February 14, 2025
280 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ఇల్లందు మండలం మర్రిగూడెం వద్ద అధికారులు సుమారు 280 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి నుంచి విజయవాడ తరలిస్తున్నట్లు గుర్తించారు.
Similar News
News September 15, 2025
డిజిటల్ ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు. సోమవారం కోదాడలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఆయన నూతన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. విద్యార్థులు కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
News September 15, 2025
విడాకులు తీసుకున్న వారితో నాకు పెళ్లి అనేవారు: మీనా

తనపై గతంలో వచ్చిన వార్తలను జగపతి బాబు షోలో సీనియర్ నటి మీనా గుర్తు చేసుకున్నారు. ‘అప్పుల్లో ఉన్నామని తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవాలని నిర్మాతలు అడిగేవారు. అలా తీసిన సినిమాలు హిట్ అయ్యాక నన్ను మర్చిపోయేవాళ్లు. వరుస అవకాశాలు ఉన్నప్పటికీ నేను పెళ్లి చేసుకున్నాను. 2022లో భర్తను కోల్పోయాక ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్నా నాతో పెళ్లి అని వార్తలొచ్చేవి. అవి చూసినప్పుడు బాధేసేది’ అని చెప్పారు.
News September 15, 2025
HNK: ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

ప్రభుత్వ ఉపాధి కల్పన శిక్షణ శాఖ, ఐటీఐ హనుమకొండ, ATC/ITIలో మిగిలిన సీట్లకు ప్రవేశాల గడువును పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ జి సక్రు ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విధ్యా సంవత్సరానికి గాను 4th Phase వాక్ ఇన్(స్పాట్) అడ్మిషన్ల గడువును ఈనెల 30న వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. వివరాలకు మొబైల్ 9490855355, 9908315560ను సంప్రదించాలని అన్నారు.