News February 14, 2025
Good News: హోల్‌సేల్ రేట్లు తగ్గాయ్..

భారత టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) జనవరిలో 2.31 శాతానికి తగ్గింది. 2024 డిసెంబర్లో ఇది 2.37%. గత ఏడాది జనవరిలో ఇది 0.27 శాతమే కావడం గమనార్హం. ఆహార వస్తువుల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. ఫుడ్ ప్రొడక్ట్స్, టెక్స్‌టైల్స్ తయారీ, క్రూడ్ పెట్రోల్, గ్యాస్ ధరలు మాత్రం పెరుగుతున్నట్టు పేర్కొంది. డిసెంబర్లో 8.89గా ఉన్న WPI ఫుడ్ ఇండెక్స్ విలువ జనవరిలో 7.47కు దిగొచ్చిందని తెలిపింది.
Similar News
News March 12, 2025
జగన్‌పై విజయసాయి సంచలన వ్యాఖ్యలు

AP: మాజీ CM YS జగన్‌పై YCP మాజీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ దగ్గరికి తీసుకెళ్తారు. కోటరీ మాటలు వినొద్దని జగన్‌కు చాలాసార్లు చెప్పినా ఫలితం లేదు. చెప్పుడు మాటలను నాయకుడు వినకూడదు. జగన్ మనసులో స్థానం లేదు కాబట్టి YCP నుంచి బయటకు వచ్చా. నా మనసు విరిగిపోయింది. విరిగిన మనసు మళ్లీ అతుక్కోదు. తిరిగి వైసీపీలో చేరే ప్రసక్తే లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News March 12, 2025
కొడాలి నానికి ఊరట

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి హైకోర్టులో ఊరట దక్కింది. విశాఖలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలో కొడాలి నానిపై ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. 35(3) కింద ఆయనకు నోటీసులు ఇచ్చి వివరాలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
News March 12, 2025
ఝట్కా, హలాల్ మటన్‌కు తేడా ఏంటి?

మహారాష్ట్రలో మల్హర్ సర్టిఫికేషన్ నేపథ్యంలో ఝట్కా, హలాల్ విధానాలపై SMలో చర్చ జరుగుతోంది. మొఘలులకు పూర్వం దేశంలో ఝట్కా విధానమే పాటించేవారు. జీవికి సునాయాస మరణం ప్రసాదించడమే దీని ప్రధాన ఉద్దేశం. అంటే ఒక్క వేటుతో మెడను వేరు చేస్తారు. దీనివల్ల చెడు హార్మోన్లు ఉత్పత్తి అవ్వవని, మాంసం ఫ్రెష్‌గా ఉంటుందని చెప్తారు. అలాగే మనిషి లాలాజలంతో కలుషితం అవ్వదంటారు. హలాల్ ప్రక్రియ ఇందుకు భిన్నంగా ఉంటుంది.