News February 14, 2025

అనకాపల్లిలో మాదకద్రవ్యాల నియంత్రణపై వర్క్ షాప్

image

అనకాపల్లిలో మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీస్ అధికారులకు ఒకరోజు వర్క్ షాప్ శుక్రవారం నిర్వహించారు. కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ అధికారి రంగధామ్ మాట్లాడుతూ.. చట్టపరమైన అంశాలు దర్యాప్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. అదనపు ఎస్పీ దేవ ప్రసాద్ మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

Similar News

News November 4, 2025

MHBD: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 3 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతూ రాజు అనే వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందాడు. 3 రోజుల క్రితం బతికి ఉన్న రాజును వైద్య సిబ్బంది మార్చురీలో పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా రాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఆస్పత్రిలో వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే రాజు మృతి చెందాడని ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

News November 4, 2025

పెద్దపల్లి యార్డులో పత్తి క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.6,844

image

పెద్దపల్లి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి కొనుగోలు సజావుగా సాగింది. పత్తి క్వింటాలుకు కనిష్ట ధర రూ.5,701, గరిష్టం రూ.6,844, సగటు ధర రూ.6,621గా నమోదైంది. మొత్తం 477 మంది రైతులు 1,393.2 క్వింటాళ్ల పత్తిని విక్రయించారు. మార్కెట్ యార్డులో ఎలాంటి సమస్యలు లేకుండా వ్యాపారం ప్రశాంతంగా సాగిందని వ్యవసాయ మార్కెట్ ఇంచార్జ్ మనోహర్ తెలిపారు.

News November 4, 2025

జగన్ పర్యటనకు వింత షరతులు: వైసీపీ ఫైర్

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణాజిల్లా పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు గాను జగన్ నేడు జిల్లాలోని గూడూరు, మచిలీపట్నం రానున్నారు. అయితే జగన్ పర్యటనలో 500 మంది, 10 కాన్వాయ్‌లకే పోలీసులు అనుమతి ఇచ్చారు. బైక్‌లకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై YCP ట్వీట్ చేసింది. జగన్ పర్యటనకు వేలాది మంది వస్తారని తెలిసినా ఈ వింత షరతులు ఏంటని మండిపడింది.