News February 14, 2025

BRS తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలి: ఖానాపూర్ MLA

image

నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పేర్కొన్నారు. ఉట్నూర్‌లోని కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమై ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని, BRS తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు.

Similar News

News November 9, 2025

KNR: ట్రాఫిక్ చలాన్ పేరుతో సైబర్ మోసం

image

KNR జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్ పేరుతో ఫేక్ వాట్సాప్ మెసేజ్ పంపి, APK యాప్ డౌన్‌లోడ్ చేయించడంతో చెర్లబుత్కూర్ గ్రామానికి చెందిన మధుకర్ ఖాతా నుంచి రూ.70,000లు, ఇతర బాధితుల నుంచి మరో రూ.1.20 లక్షల వరకు సొమ్ము మాయమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద లింకులు, యాప్‌లను క్లిక్ చేయవద్దని పోలీసులు సూచించారు.

News November 9, 2025

గన్నేరువరం మానసా దేవి ఆలయానికి భక్తుల రద్దీ

image

కార్తీక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో గన్నేరువరంలోని ప్రసిద్ధ స్వయంభు మానసాదేవి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 108 శివలింగాలు, జంట నాగులకు జలాభిషేకాలు నిర్వహించి, దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించారు. ఆలయ కమిటీ భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించింది. భక్తులు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వాహనాలను ఉచిత పార్కింగ్ స్థలంలోనే నిలపాలని కమిటీచైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి సూచించారు.

News November 9, 2025

వెయ్యి మందికి రూ.9 కోట్ల సాయం: మంత్రి స్వామి

image

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి CMRF చెక్కులు పంపిణీ చేశారు. మర్రిపూడి మండలం పలువురికి మంజూరైన చెక్కులను ఆదివారం ఆయన అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం పట్ల సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొండపి నియోజకవర్గంలో దాదాపు వేయ్యి మందికి రూ.9కోట్ల వరకు సాయం చేశామని వెల్లడించారు.