News February 14, 2025
స్కూలు విద్యార్థులకు శుభవార్త

AP: BC విద్యార్థుల ₹110.52 కోట్ల డైట్ బకాయిలు, ₹29 కోట్ల కాస్మోటిక్ బిల్లులు చెల్లించాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ₹13.10 కోట్లతో 660 హాస్టళ్లలో చేపట్టిన మరమ్మతులు 6 వారాల్లో పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, కిచెన్ ఐటెమ్స్ అందించాలని సూచించారు. నసనకోట, ఆత్మకూరు BC సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని చెప్పారు.
Similar News
News November 6, 2025
రూ.5వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీల బంద్: ఫతి

TG: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కాలేజీలు మూతబడి 4 రోజులు అవుతోంది. రూ.10వేల కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో రూ.5వేల కోట్లు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుందని ‘ఫతి’ స్పష్టం చేసింది. మిగతా రూ.5వేల కోట్లలో నెలకు రూ.500 కోట్ల చొప్పున 10 నెలల్లో విడుదల చేయాలంది. అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని.. అందుకే బంద్‌కు దిగాల్సి వచ్చిందని పేర్కొంది.
News November 6, 2025
ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి ?

ఆయుష్షు కోరుకునేవారు తూర్పు ముఖంగా, కీర్తి, పేరు ప్రఖ్యాతలు కోరుకునేవారు దక్షిణ ముఖంగా కూర్చుని భోజనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తూర్పు దిశ నుంచి ప్రాణ, సానుకూల శక్తి వస్తుంది. ఈ శక్తి భోజనం చేసేటప్పుడు శరీరంలోకి ప్రవహించి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారం ఆయురారోగ్యాలను ఇవ్వడానికి, ఉత్తమ ఫలితాలను పొందడానికి ఈ నియమాలు పాటించాలి. భోజనం చేసేటప్పుడు పద్మాసనంలో కూర్చోవడం, మౌనం పాటించడం మంచిది.
News November 6, 2025
5,346 టీచర్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఢిల్లీలో 5,346 <


