News March 20, 2024

HYD: కొత్త గవర్నర్‌ను సత్కరించిన హర్యానా గవర్నర్, సీఎం 

image

HYD రాజ్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సీపీ రాధాకృష్ణన్‌ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. కాగా రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. 

Similar News

News September 5, 2025

HYD: నిమజ్జనం చేసిన లారీలు ఇలా వెళ్లాలి

image

ట్యాంక్ బండ్ వద్ద విగ్రహాలను తెచ్చిన లారీలు నిమజ్జనం పూర్తి చేసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక రూట్లను అధికారులు ఏర్పట్లు చేశారు. NTR మార్గ్‌లో నిమజ్జనం చేసినవి నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వీవీ స్టాట్యూ, కేసీపీల మీదుగా వెళ్లాలి. అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి నిమజ్జనం చేసిన లారీలు చిల్డ్రన్స్ పార్క్, DBR మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలన్నారు.

News September 5, 2025

సికింద్రాబాద్ PG కాలేజీలో బోధించేందకు ఛాన్స్

image

ఓయూ పరిధిలోని సికింద్రాబాద్ పీజీ కాలేజీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో బోధించుటకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.గంగాధర్ తెలిపారు. కాలేజీలోని హిందీ, ఇంగ్లిష్, గణితశాస్త్రం, స్టాటిస్టిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులను బోధించుటకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News September 5, 2025

HYD: కోర్టు హాల్‌లో దురుసు ప్రవర్తన.. హై కోర్ట్ ఆగ్రహం

image

కోర్టు హాల్‌లో దురుసుగా ప్రవర్తించిన పిటిషనర్‌పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సివిల్ సూట్ రివ్యూ పిటిషన్‌పై తీర్పు ఎందుకు ఇవ్వరంటు జడ్జితో పిటిషనర్ దురుసుగా ప్రవర్తించాడు. పిటిషనర్ చెన్నకృష్ణారెడ్డి సీనియర్ సిటిజన్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసి కేసు నుంచి జడ్జి జస్టిస్ నగేశ్ తప్పుకున్నారు. సీజే బెంచ్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని కోర్ట్ ఆదేశించింది.