News February 15, 2025

ఇసుక అక్రమ రవాణా ఉపేక్షించం: ఇన్‌ఛార్జ్ సీపీ

image

ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారిని ఉపేక్షించబోం అని నిజామాబాద్ ఇన్‌ఛార్జి సీసీ సింధు శర్మ హెచ్చరించారు. 2025 జనవరి, ఫిబ్రవరి నెలలో నిజామాబాద్ డివిజన్ పరిధిలో 13, ఆర్మూర్ డివిజన్ పరిధిలో 13, బోధన్ డివిజన్ పరిధిలో ఐదు ఇసుక అక్రమ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎవరైనా రవాణాకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Similar News

News July 6, 2025

రాష్ట్రంలో ఊపందుకున్న బర్లీ పొగాకు కొనుగోళ్లు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా HD బర్లీ పొగాకు కొనుగోళ్లు జరుగుతున్నాయని మార్క్‌ఫెడ్ ఎండీ ఢిల్లీరావు తెలిపారు. ఇంకొల్లు, పంగులూరు, పర్చూరు, బీకేపాలెం, చీరాల, గుంటూరు, పెదకాకాని, చిలకలూరిపేట, ఎడ్లపాడు, గుండ్లపల్లి కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పారు. రూ17.20 కోట్ల విలువైన 2245 బేళ్ల పొగాకు విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. రైతులకు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

News July 6, 2025

‘రాష్ట్రంలో అనంత జిల్లా మొదటి స్థానంలో నిలవాలి’

image

మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0ని రికార్డ్ సృష్టించేలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి పేరెంట్ టీచర్స్ మీటింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 10న సత్య సాయి జిల్లాలో జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కి సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందన్నారు.

News July 6, 2025

వర్షంలో తడుస్తున్నారా?

image

కొందరు వర్షంలో తడుసుకుంటూ ఇంటికి వచ్చి యథావిధిగా పనులు చేసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తడిసిన వెంటనే దుస్తులు మార్చుకుంటే శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీనివల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ కారకాల నుంచి తప్పించుకోవచ్చు. శరీరంపై యాంటీ బాక్టీరియల్ క్రీమ్ రాసుకోవాలి. టీ లేదా కషాయాలు తాగాలి. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.