News February 15, 2025

HYDలో యుద్ధ విమానం తయారీ!

image

నగరంలోని డీఆర్డీఓతో కలిసి VEM టెక్నాలజీ సంస్థ అత్యాధునిక AMCA యుద్ధ విమానాన్ని తయారు చేసింది. కర్ణాటకలోని బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా-2025 ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా ఈ విమానం నిలిచింది. దాదాపు 60 దేశాలకు చెందిన హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి.AMCA యుద్ధ విమానాన్ని HYDలోనే పూర్తిగా అసెంబ్లింగ్ చేశారు.

Similar News

News November 9, 2025

HYD: వారి జోలికి హైడ్రా వెళ్లదు: రంగనాథ్

image

నగరంలో తొలి విడతలో 6 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువుల ఆక్రమణలను తొలగించి 105 ఎకరాల నుంచి 180 ఎకరాలకు పెంచామన్నారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నవారు హైడ్రాపై దాదాపు 700 వరకు కేసులు పెట్టారని, 2024 జులైకి ముందు నుంచే నివాసం ఉన్న వారి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదన్నారు.

News November 9, 2025

బైక్‌ను ఢీకొట్టిన లారీ..యువకుడి మృతి

image

ఎస్.రాయవరం మండలం గోకులపాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.రంజిత్ (28) మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. తలుపులమ్మలోవ నుంచి ఎలమంచిలి వైపు వెళుతున్న బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న రాజేశ్, గణేశ్ గాయపడ్డారు. వీరిని ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్.రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 9, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ వివరాలివే

image

✒ ఎల్లుండి పోలింగ్, బరిలో 58 మంది అభ్యర్థులు
‎✒ 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు. మొత్తం 4,01,365 మంది ఓటర్లు. పోలింగ్ విధుల్లో పాల్గొననున్న 2060 మంది సిబ్బంది
‎✒ 139 ప్రాంతాల్లో డ్రోన్లతో పటిష్ఠమైన నిఘా. 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గుర్తింపు
‎✒ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల దగ్గర పారామిలిటరీ బలగాలతో బందోబస్తు
‎✒ GHMC ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
✒ ఈ నెల 14న ఓట్ల లెక్కింపు, ఫలితం