News February 15, 2025
ఏలూరు జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలు: కలెక్టర్

పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
Similar News
News November 9, 2025
వంజంగి మేఘాలకొండను సందర్శించిన కలెక్టర్

వంజంగి మేఘాలకొండ అందాలను కలెక్టర్ ఏ.ఎస్.దినేశ్ కుమార్ ఆస్వాదించి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో వంజంగి కొండపైకి చేరుకున్నారు. మంచు మేఘాలను చీల్చుకుంటూ వచ్చే సూర్యోదయ కిరణాలు, మంచు మేఘాల అందాలను వారు తిలకించారు. కాగా వీకేండ్ కావడం, రెండు రోజుల సెలవుతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వంజంగి వచ్చి సందడి చేస్తున్నారు.
News November 9, 2025
GWL: టీబీ డ్యామ్ ఆయకట్టుకు డిసెంబర్ 20 వరకు సాగునీరు

కర్ణాటక రాష్ట్రం హోస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్‌కు నూతన గేట్లు అమర్చేందుకు ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు టీబీ డ్యామ్ పరిధిలోని ఆయకట్టుకు డిసెంబర్ 20 వరకు మాత్రమే సాగునీరు అందిస్తామని తెలిపారు. రబీలో క్రాప్ హాలిడే ప్రకటించి కొత్త గేట్లు అమర్చుతామని తెలిపారు. విషయాన్ని ఆయకట్టు రైతులు గ్రహించి సహకరించాలన్నారు. ఈ విషయమై 3 రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
News November 9, 2025
గండేపల్లి: వరి కోత యంత్రానికి విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరి మృతి

గండేపల్లి మండలం రామయ్యపాలెం శివారున ఆదివారం విషాదం చోటు చేసుకుంది. వరి కోత కోస్తున్న యంత్రానికి విద్యుత్ వైర్లు తగలడంతో యంత్రంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న రైతులు నివ్వెరపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


