News February 15, 2025

చల్పాకలో సమ్మక్కకు పూజలు నిర్వహిస్తున్న భక్తులు

image

ఏటూరునాగారం మండలం బానాజీ బంధం (చల్పాక)లో ఆలం వంశీయులు (తలపతులు), కోరం వంశీయులు (వడ్డేలు) ఆధ్వర్యంలో సమ్మక్క జాతర ఘనంగా జరుగుతోంది. గురువారం రాత్రి దేవుని గుట్ట నుండి సమ్మక్క రూపంలో తీసుకొచ్చిన కుంకుమ భరణిని ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మక్క గద్దె పైకి తెచ్చి ప్రతిష్ఠించారు. సమ్మక్కను దర్శించుకోవడానికి శుక్రవారం భక్తులు భారీగా తరలివస్తున్నారు. శనివారంతో ఈ జాతర ముగియనుంది.

Similar News

News January 11, 2026

కలుపు తీయని పైరు కర్ర చేయదు

image

పొలంలో కలుపును రైతులు సరైన సమయంలో గుర్తించి తొలగించకపోతే పంటకు అందాల్సిన పోషకాలను ఆ కలుపు మొక్కలే లాగేసుకుంటాయి. దీని వల్ల పైరులో ఎదుగుదల లోపిస్తుంది. ఫలితంగా సరిగా గింజ పట్టదు లేదా బలమైన ‘కర్ర’ (కాండం)గా ఎదగదు. అలాగే ఏదైనా ఒక పనిలో విజయం సాధించాలన్నా, ఒక వ్యక్తి గొప్పగా ఎదగాలన్నా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న అనవసరమైన విషయాలను, లోపాలను ఎప్పటికప్పుడు తొలగించుకొని ముందుకు సాగాలని ఈ సామెత తెలియజేస్తుంది.

News January 11, 2026

ఆర్మూర్: దంపతుల ఆత్మహత్యాయత్నం

image

ఆర్మూర్ శివారులో శనివారం సాయంత్రం దంపతులు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండలం పడిగేలా గ్రామం వడ్డెర కాలనికి చెందిన రవితేజ, భార్య శోభ పట్టణ శివారులోని ఓ వెంచర్‌లో విషం తాగి ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.

News January 11, 2026

రేపు PSLV-C62 ప్రయోగం

image

AP: ISRO మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌-షార్‌ నుంచి రేపు ఉదయం 10.17 గంటలకు PSLV-C62 రాకెట్‌ను ప్రయోగించనుంది. దీని ద్వారా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి పంపనుంది. కొత్త ఏడాదిలో ISROకు ఇదే తొలి ప్రయోగం. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ఈరోజు మధ్యాహ్నం 12.17 గంటలకు ప్రారంభించనున్నారు.