News February 15, 2025

హీరో నితిన్‌కు ఎమ్మెల్యే బొజ్జల ఆహ్వానం

image

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రముఖ సినీ నటుడు నితిన్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికారిక ఆహ్వానం అందించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రత్యేక ఉత్సవాల్లో సినీ హీరో నితిన్ పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు.

Similar News

News September 18, 2025

భూగర్భ జలాలను పెంచాలి: గోదావరి డెల్టా ఛైర్మన్

image

భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోదావరి డెల్టా ఛైర్మన్ సునీల్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి భూగర్భ జలాలు పెంచేందుకు తయారుచేసిన ప్రాజెక్టు రిపోర్టును అందజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు చెరువులు కాలువల్లో భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోదావరి డెల్టా ఛైర్మన్ సునీల్ కుమార్ తెలిపారు.

News September 18, 2025

సీఎంతో డీఎస్సీ అభ్యర్థుల సమావేశం వాయిదా: డీఈవో

image

వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో శుక్రవారం అమరావతిలో జరగాల్సిన డీఎస్సీ ఉపాధ్యాయుల సమావేశం వాయిదా పడినట్లు డీఈఓ షేక్ సలీం బాషా తెలిపారు. జిల్లా కలెక్టర్ నుంచి ఈ సమాచారం అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎంఈఓలు డీఎస్సీ అభ్యర్థులకు తెలియజేయాలని సూచించారు. తదుపరి సమావేశం తేదీని ఇంకా నిర్ణయించలేదని, డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 18, 2025

వైట్ హెడ్స్ ఇలా తొలగిద్దాం..

image

కొందరికి చర్మంపై చిన్నగా తెల్లని మచ్చలు ఉంటాయి. అవే వైట్ హెడ్స్. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి. * కాస్త ఓట్స్ పొడిలో నీళ్లు కలిపి మెత్తని ముద్దలా చేసి సమస్య ఉన్న చోట రాయాలి.15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. * చెంచా వంటసోడాలో నీళ్లు కలిపి వైట్‌హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఆ వంట సోడా పూత ఆరిపోయాక కడిగెయ్యాలి. ఇలా తరచూ చేస్తోంటే వైట్ హెడ్స్‌తోపాటు అధిక జిడ్డు సమస్య కూడా తగ్గుతుంది.