News March 20, 2024

కారేపల్లి సొసైటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం?

image

కారేపల్లి సొసైటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేసినట్లు మండలంలో జోరుగా చర్చ జరుగుతుంది. 2, 3 రోజుల్లో సొసైటీ డైరెక్టర్లు ఖమ్మం డిసిఓని కలవడానికి వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. కాగా మండలంలో సొసైటీ డైరెక్టర్లు మొత్తం 13 మంది ఉండగా, పదిమంది డైరెక్టర్లు చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Similar News

News March 6, 2026

భూదాన్ భూముల పేరుతో మోసం..నలుగురి అరెస్ట్

image

ఖమ్మం వెలుగుమట్లలో భూదాన్ భూముల పేరుతో అమాయకులను మోసగించిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. ఓపీడీఆర్ సభ్యులమని నమ్మిస్తూ నిందితులు బల్లి శ్రీనివాస్, కోపెర వెంకన్న, కొట్టే బసు, సంపంగి వెంకటాచలం భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నామని సీఐ పేర్కొన్నారు

News March 6, 2026

ఖమ్మం: దవాఖానాల్లో 99 రోజుల ‘స్పెషల్’ ప్లాన్!

image

ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు వైద్యారోగ్య శాఖ నడుం బిగించింది. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లావ్యాప్తంగా ‘99 రోజుల ప్రత్యేక కార్యాచరణ’ను ప్రారంభించినట్లు DMHO డా. రామారావు తెలిపారు. జూన్ 12 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో ఆసుపత్రుల్లో పేరుకుపోయిన చెత్త, పాత ఫర్నిచర్, కాలం చెల్లిన మందులను తొలగించాలని ఆదేశించారు. ప్రాంగణాలను ‘క్లీన్ & గ్రీన్’గా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు.

News March 6, 2026

ఖమ్మం: బోధన విస్మరించి.. వ్యాపారాల్లో నిమగ్నం!

image

ఖమ్మం జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన గురువులు.. తమ అసలు బాధ్యతను విస్మరించి సైడ్‌ బిజినెస్‌లలో మునిగితేలుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రెండో ఆదాయంపై మక్కువతో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇలాంటి వారిపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.