News March 20, 2024
BREAKING: పరీక్ష వాయిదా

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ బోర్డు సెక్రటరీ పుల్లయ్య కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మే 17న జరగాల్సిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష(పాలీసెట్)ను వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేశారు. మే 24న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News April 4, 2025
పిల్లలతో RCB ప్లేయర్ల సెల్ఫీలు.. వైరల్

టాలెంటెడ్ యంగ్ క్రికెటర్లతో RCB ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య, పడిక్కల్ సెల్ఫీలు దిగారు. వారితో సరదాగా మాట్లాడి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. తమ ఆరాధ్య క్రికెటర్లతో ఫొటోలు దిగడంతో పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. పైన ఫొటోలు చూడొచ్చు.
News April 4, 2025
జింక మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి: కేటీఆర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రకృతి విధ్వంసంతో ఒక వన్యప్రాణి బలైందని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ HCUలోని అడవిని నరికించడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతిందన్నారు. చెట్లను తొలగించడంతో ఎటు వెళ్లాలో తెలియక జింక వర్సిటీ పరిధిలోకి వచ్చిందని తద్వారా కుక్కల దాడిలో మృతి చెందిందన్నారు. ఒక వన్య ప్రాణి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.
News April 4, 2025
అమెరికాతో చైనా టారిఫ్ వార్.. 34శాతం సుంకం విధింపు

అమెరికా టారిఫ్‌లపై చైనా అన్నంత పని చేసింది. US ఉత్పత్తులపై 34శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల అన్ని దేశాలపై టారిఫ్‌లు పెంచిన అమెరికా చైనా పైనా 34శాతం సుంకం విధించింది. దీనిపై ఘాటుగా స్పందించిన డ్రాగన్ దేశం టారిఫ్ తగ్గించకపోతే మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది. కానీ అమెరికా దీనిపై వెనక్కి తగ్గకపోవడంతో ప్రతీకారంగా చైనా 34శాతం సుంకం విధించింది.