News February 15, 2025
‘కాంత’లో భాగ్య శ్రీ.. ఆకట్టుకుంటున్న లుక్

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘కాంత’ సినిమా నుంచి విడుదలైన భాగ్యశ్రీ బోర్సే లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో సంప్రదాయ వస్త్రధారణలో లూజ్ హెయిర్‌తో ఆమె కనిపిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 1950 కాలంలో మద్రాస్ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది. ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ ప్రస్తుతం ‘కాంత’తో పాటు RAPO22, కింగ్‌డమ్ సినిమాల్లో నటిస్తున్నారు.
Similar News
News November 7, 2025
సోషల్ జస్టిస్& ఎంపవర్‌మెంట్‌లో 49 ఉద్యోగాలు

<
News November 7, 2025
జీపీఎస్ స్పూఫింగ్ అంటే?

GPS స్పూఫింగ్ అనేది ఒక సైబర్ అటాక్. GPS సిగ్నల్‌లను మానిప్యులేట్ చేసి నావిగేషన్ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. ఇలా ఫేక్ శాటిలైట్ సిగ్నల్‌లను ప్రసారం చేయడంతో విమానాలు ఫాల్స్ రూట్లలో వెళ్లే అవకాశముంది. ఓ చోట ఉన్న ఫ్లైట్ మరో చోట ఉన్నట్లు చూపిస్తుంది. దీని వల్ల ఫ్లైట్స్ టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేటప్పుడూ ప్రమాదాలకు ఆస్కారముంటుంది. <<18227103>>ఢిల్లీ<<>>, ముంబైలో విమాన సేవల అంతరాయానికి ఇదే కారణమనే అనుమానాలున్నాయి.
News November 7, 2025
ప్రేమికుడిపై కక్షతో ఫేక్ మెయిల్స్… చివరకు జైలు

ప్రేమ విఫలమైన ఓ యువతి ప్రేమికుడి పేరిట ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపి కటకటాల పాలైంది. రోబోటిక్ ఇంజినీర్ రెనా జోషిల్డా(గుజరాత్) ప్రభాకర్ అనే సహచరుడిని ప్రేమించింది. అయితే ఆయన మరో పెళ్లి చేసుకోగా కక్షగట్టింది. ఆయన వర్చువల్ నంబర్‌తో అనేక రాష్ట్రాల స్కూళ్లు, కోర్టులు, స్టేడియాల్ని పేల్చేస్తున్నట్లు రెనా మెయిల్స్ పంపింది. 21 ప్రాంతాల్లో పోలీసులను పరుగులు పెట్టించి చివరకు బెంగళూరులో అరెస్టైంది.


