News February 15, 2025
పంజాబ్‌ను డీఫేమ్ చేయాలని చూస్తున్నారా?: CM

US నుంచి INDకు అక్రమ వలసదారులను తరలిస్తున్న విమానాలను అమృత్‌సర్‌లో ల్యాండింగ్ చేస్తుండటంపై పంజాబ్ CM భగవంత్ మాన్ ఆగ్రహించారు. ‘ఢిల్లీకి బదులు ఇక్కడ ఎందుకు ల్యాండింగ్ చేస్తున్నారు. మా రాష్ట్రాన్ని డీఫేమ్ చేయాలని చూస్తున్నారా? తొలి విమానంలో వచ్చిన వారిలో ఎక్కువ మంది గుజరాత్ వాళ్లే ఉన్నారు. ఎందుకు ఫ్లైట్‌ను అహ్మదాబాద్‌లో ల్యాండింగ్ చేయలేదు?’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Similar News
News November 9, 2025
అన్ని దోషాలను పోగొట్టే రాహు కేతువు పూజ… మీరు చేయించుకున్నారా?

వివాహం కాకపోవడం, సంతాన సమస్యలు, ఆర్థిక, ఉద్యోగ ఆటంకాలతో ఇబ్బందులు పడుతున్నవారు, కాలసర్ప దోషం ఉన్నవారు రాహు కేతువు పూజ చేయించుకుంటారు. సకల దోషాలను పోగొట్టే అత్యంత శక్తిమంతమైన ఈ పూజ APలోని శ్రీకాళహస్తి, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ క్షేత్రాల్లో నిర్వహిస్తారు. దీని ఫలితంతో జాతక దోషాలు తొలగి, జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ పూజ తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలని పండితుల సూచన.
News November 9, 2025
కార్తీకం: ఆదివారం ఎవరికిలా పూజ చేయాలి?

ఆదివారం సూర్యుడిని పూజించాలని చెబుతారు. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి, సూర్యుడు రాగానే ‘ఓం ఆదిత్యా నమ:’ అంటూ ఆయన పేర్లను స్తుతించాలని పండితుల సూచన. ‘ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించాలి. బెల్లం, పాలు, ఎరుపు వస్త్రాలు దాయడం ఉత్తమం. ఉపవాసం మంచిదే. ఉప్పు-నూనె లేని ఆహారం తినవచ్చు. కార్తీకంలో ఈ నియమాల వల్ల సూర్యానుగ్రహంతో జాతకంలో సూర్యుని స్థానం బలపడి శాంతి, మనశ్శాంతి లభిస్తాయి’ అంటున్నారు.
News November 9, 2025
ప్రచారానికి వాళ్లు దూరమేనా!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రచారానికి దూరమైనట్లేనని సమాచారం. నేటితో ప్రచార పర్వం ముగియనుండగా ఆయన వచ్చే సూచనలు కనిపించట్లేదు. ఆ బాధ్యతలను కేటీఆర్ భుజాలపై వేసుకొని కొనసాగిస్తున్నారు. అటు బీజేపీ నుంచి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, అన్నామలై, పురందీశ్వరి, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ వస్తారని పేర్కొన్నా ఇప్పటి వరకు వారి జాడే లేదు.


