News February 15, 2025

HYD: అలా కనిపిస్తే ఫిర్యాదు చేయండి: డిజీ

image

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్రమంగా మెడిసిన్ నిల్వలు, తయారీ, విక్రయాలు జరిగితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని DCA డీకే కమలాసన్ రెడ్డి సూచించారు. 18005996969కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డ్రగ్స్ సంబంధిత సమాచారం అందినా తమకు తెలియజేయాలని సూచించారు.

Similar News

News December 31, 2025

సిరిసిల్ల: ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన ఇంఛార్జ్ కలెక్టర్

image

ఎరువుల విక్రయాల రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. బుధవారం ఆమె పెద్దూరులోని ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. జిల్లాలో యూరియా, ఇతర ఎరువుల విక్రయాల నమోదులో పట్టాదారు పాసుపుస్తకాల వివరాలను కచ్చితంగా పొందుపరచాలని ఆదేశించారు. విక్రయాల్లో ఏవైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

News December 31, 2025

పాలకోడేరు: పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్

image

కుముదువల్లి పంచాయతీ చినపేటలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేశారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కలెక్టర్ కుమారుడు చదలవాడ భరత్ వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.

News December 31, 2025

వేములవాడ: ప్రారంభమైన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు

image

వేములవాడలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 31 సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి అడ్డుకట్ట వేసేందుకు వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ రాజు నేతృత్వంలో పట్టణంలోని వివిధ ప్రాంతాలలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 8 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.