News February 15, 2025
అంబేడ్కర్ కోనసీమ: విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి

సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో విద్యుత్ షాక్‌కు గురై నాగేశ్వరరావు (49) శుక్రవారం మృత్యువాత పడ్డాడు. రొయ్యల చెరువు వద్ద మేత వేస్తూ కరెంటు షాకుకు గురయ్యాడు. అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా నాగేశ్వరరావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై మృతిని భార్య వరలక్ష్మి ఫిర్యాదుపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 14, 2025
పులివెందుల మెడికల్ కాలేజీపై మీ మాటేంటి?

పులివెందులలో మెడికల్ కాలేజీపై కూటమి, వైసీపీ నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. పులివెందులలో మెడికల్ కాలేజీ పూర్తి చేయలేదని MLC రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. NMC కాలేజీని పరిశీలించిన తర్వాతేగా 50 సీట్లు కేటాయించింది. అంటే NMC కళ్లు మూసుకుని సీట్లు కేటాయించిందా అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పులివెందుల మెడికల్ కాలేజీపై కూటమి నేతలు చేస్తున్నది అవాస్తవమని మాజీ ఎంపీ తులసిరెడ్డి ధ్వజమెత్తారు.
News September 14, 2025
మచిలీపట్నంలో కేజీ చికెన్ ధర ఎంతంటే.?

మచిలీపట్నంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. పట్టణంలో చికెన్ విత్ స్కిన్ కిలో రూ.220, స్కిన్‌లెస్ కిలో రూ.240కు విక్రయాలు జరుగుతున్నాయి. అదే ధరలు గ్రామాల్లో ఎక్కువగా ఉండి స్కిన్ ఉన్న చికెన్ కిలో రూ.240, స్కిన్‌లెస్ రూ.260కు అమ్ముతున్నారు. మటన్ కిలో రూ.1000గా ఉండగా, గ్రామాల్లో మాత్రం కిలో రూ.800కి విక్రయాలు జరుగుతున్నాయి.
News September 14, 2025
GWL: సైబర్ క్రైమ్ బాధితులకు రిఫండ్ ఆర్డర్ కాపీలు

గద్వాల జిల్లాలో నమోదైన సైబర్ క్రైమ్ కేసులను సైబర్ క్రైమ్ పోలీసులు చేదించారు. 61 మంది బాధితులకు సంబంధించి రూ.17,26,363 ఫ్రీజ్ చేయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. శనివారం గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశం మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో బాధితులకు రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేశారు. దీంతో వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.