News February 15, 2025

మైలవరం: యూట్యూబ్ చూసి తండ్రిని చంపిన కుమారుడు

image

మైలవరం (మ) మెర్సుమల్లి శివారు ములకపెంటలో ఇటీవల కన్నతండ్రిని కుమారుడు చంపిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. నిందితుడు పుల్లారావు డబ్బును షేర్ మార్కెట్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. దీంతో తండ్రి శ్రీనివాసరావును ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వమని అడిగాడు. తండ్రి ఒప్పుకోలేదని కోపంలో కర్రతో కొట్టి చంపాడు. యూట్యూబ్‌లో పలు నేర కథనాలు చూసి కర్రతో కొట్టి చంపినట్లు విచారణలో తెలిందని సీఐ చంద్రశేఖర్ చెప్పారు.

Similar News

News November 10, 2025

NLG: ఇన్‌ఛార్జి పాలన ఇంకెన్నాళ్లు..?

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవదాయశాఖలో ఇన్‌ఛార్జిల పాలన కొనసాగుతోంది. చెరువుగట్టు, దర్వేశీపురం, కోట మైసమ్మ టెంపుల్ తదితర ఆలయాలకు రెగ్యులర్ ఈవోలు లేరు. దీంతో దేవాలయాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడి దేవుడి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఆస్తుల పరిరక్షణ, ఇతర నిర్వహణ సైతం సరిగా లేదని చెబుతున్నారు. కొన్ని ఆలయాల్లో వసతులు సరిగా లేవంటున్నారు.

News November 10, 2025

ఆస్ట్రేలియాలో SM వాడకంపై ఆంక్షలు.. DEC నుంచి అమలు

image

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించనున్నట్లు ఆస్ట్రేలియా PM ఆంథోనీ ఆల్బనీస్ ప్రకటించారు. వారి ఆన్‌లైన్ సేఫ్టీ కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ సేఫ్టీ అమెండ్‌మెంట్ బిల్-2024లోని ఈ కొత్త రూల్ డిసెంబర్ 10, 2025 నుంచి అమల్లోకి రానుంది. దీంతో టీనేజర్లు FB, ఇన్‌స్టా, టి‌క్‌టాక్, X, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో అకౌంట్లు ఓపెన్ చేయడం, నిర్వహించడం చట్ట విరుద్ధం.

News November 10, 2025

చలి పులి దెబ్బ: ఇంటింటా దగ్గు, జలుబు శబ్దాలే!

image

ఒక్కసారిగా వాతావరణం మారడంతో ఇంట్లో ఒక్కరైనా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఈ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈక్రమంలో పిల్లలు, పెద్దలు స్వెటర్లు & వెచ్చని దుస్తులు ధరించడం ఉత్తమం. చల్లటి ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండండి. వేడి నీటితో ఆవిరి పట్టండి. సమస్య తీవ్రంగా ఉంటే స్వీయ వైద్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.