News March 20, 2024
వట్టిచెరుకూరు: కోడ్ పాటించని ఆటోపై కేసు నమోదు

వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆటోపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పదకొండున్నరకు ముట్లూరులో టీడీపీ, జనసేన పార్టీల తరఫున ప్రచారం చేస్తుండటంతో వాహనంపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జిల్లాలో నమోదైన తొలి కేసు ఇదేనని పోలీసులు తెలిపారు.
Similar News
News April 2, 2025
GNT: కారు ప్రమాద ఘటనపై పెమ్మసాని స్పందన

తెనాలికి చెందిన గిడుగు రవీంద్ర మోహన్ బాబు కుటుంబానికి జరిగిన కారు ప్రమాద ఘటనపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. మృతుల బంధువులను, ఆసుపత్రి వర్గాలను డిల్లీ నుంచి ఫోన్ ద్వారా సంప్రదించారు. గుండె నిబ్బరం చేసుకుని సందీప్ దంపతులకు అందంగా అండగా నిలవాలని సూచించారు. ప్రభుత్వం తరఫున సాయం అందేలా చూసే ప్రయత్నం చేస్తానని, ఈ సందర్భంగా సందీప్ బంధువులకు పెమ్మసాని వివరించారు.
News April 1, 2025
GNT: హైకోర్టుకు మాజీమంత్రి విడదల రజిని

ఏసీబీ కేసులో ఏపీ హైకోర్టును మంగళవారం మాజీ మంత్రి విడదల రజిని ఆశ్రయించారు. ఏసీబీ కేసు నుంచి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో రజిని మరిది గోపి, పీఏ రామకృష్ణ పిటిషన్లు దాఖలు చేశారు. వివరాలు సమర్పించాలని హైకోర్టు ఏసీబీకి ఆదేశించింది. తదుపరి విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
News April 1, 2025
పాఠశాలలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: DEO

ఒంటిపూట బడులకు భిన్నంగా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి C.V రేణుక ఒక ప్రకటనలో హెచ్చరించారు. మార్చి 15 నుండి ప్రభుత్వం ఒంటిపూట బడులు ప్రకటించినా కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు వాటిని పాటించడం లేదని డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7.45 నుండి మధ్యాహ్నం 12.30 ని.ల వరకు మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని స్పష్టం చేశారు.