News February 15, 2025

BHPL: నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు

image

2008 డీఎస్సీలో అర్హత సాధించిన ఎస్‌జీటీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వారిని కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు HNK డీఈవో కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు.ఉమ్మడి జిల్లాలో 295 మంది అభ్యర్థులకు గాను 182 మంది అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. నేడు BHPL జిల్లాకు చెందిన 8 మందికి నియామకపత్రాలు అందజేయనున్నారు. వీరికి నెలకు రూ.31,040 జీతం ఇవ్వనున్నారు.

Similar News

News November 4, 2025

సృజనాత్మకతతోనే ఉన్నత విద్య: డీఈవో దక్షిణామూర్తి

image

విద్యార్థులు తమలో సృజనాత్మకతను పెంచుకోవాలని డీఈవో దక్షిణామూర్తి అన్నారు. బయ్యారంలోని ఎంపీపీఎస్ పాఠశాలను తనిఖీ చేసిన ఆయన, విద్యార్థులకు కొత్త అంశాలపై నిరంతరం అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. హాజరు వివరాలు, విద్యార్థుల విద్యాసామర్థ్యాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం బాలు, ఉపాధ్యాయులు సంధ్యారాణి, రూప్ల నాయక్ తదితరులు పాల్గొన్నారు.

News November 4, 2025

అమరావతికి రూ.32,500 కోట్ల అదనపు రుణాలు

image

అమరావతి రాజధాని నగరం అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ సహా ఆర్థిక సంస్థల నుంచి భారీగా రుణాలు అందనున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి ₹14,000 కోట్లు రుణం అందే అవకాశం ఉంది. దీనితో పాటు, నాబ్‌ఫిడ్ నుంచి ₹10,000 కోట్లు, నాబార్డు నుంచి ₹7,000 కోట్లు రానున్నాయి. ఈ కొత్త నిధులతో కలిపి, సీఆర్డీఏకు ₹58,500 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. CRDA ఇప్పటికే ₹91,639 కోట్ల విలువైన 112 నిర్మాణ పనులను చేస్తోంది.

News November 4, 2025

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<>HAL<<>>) 9 డిప్లొమా టెక్నీషియన్, టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, NTC+NAC(ITI) అర్హతగల అభ్యర్థులు నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in