News February 15, 2025
విశాఖ: కామాంధుడి కోరికలకు వివాహిత బలి

గోపాలపట్నంలో శుక్రవారం జరిగిన వివాహిత ఆత్మహత్య ఘటన కలిచివేసింది. తన వికృత చేష్టలతో భార్యను దారుణంగా హింసించిన భర్త.. చివరకు ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు. పోర్న్ వీడియోలకు బానిసై భార్యతో మానవ మృగంలా ప్రవర్తించాడు. లైంగిక వాంఛకు ప్రేరేపించే మాత్రలు వేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. మానసికంగా ఎంతో వేదనను అనుభవించిన ఆమె చివరకు ఉరి వేసుకుని తన జీవితానికి ముగింపు పలికింది.
Similar News
News March 12, 2025
విశాఖ: అమ్మతో పేగు బంధం.. భగవంతుడితో అనుబంధం..!

జన్మనిచ్చిన తల్లికి తండ్రి కొనిచ్చిన స్కూటర్‌పై దేశమంతా తిప్పి చూపించాడు. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవాలయ దర్శనాలు చేపించాడు మైసూర్‌కు చెందిన దక్షిణామూర్తి కృష్ణ కుమార్. తన తల్లి చూడారత్నమ్మ కోరిక మేరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ఆలయాలకు స్కూటర్ పైనే తిప్పాడు. తల్లికిచ్చిన మాట కోసం ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదిలేశారు. వీరిద్దరూ బుధవారం విశాఖ చేరుకున్నారు.
News March 12, 2025
విశాఖలో విచ్చలవిడిగా గుట్కా..!

విశాఖనగరంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విచ్చలవిడిగా లభిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఒడిశా నుంచి రైలు మార్గంలో ఖైని, గుట్కా, పాన్ మసాలాలు విశాఖకు చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మధురవాడ, ఆరిలోవ, వెంకోజిపాలెం, మద్దిలపాలెం ప్రాంతాలలో ఏ దుకాణంలో చూసిన ఇవి విరివిగా లభిస్తున్నాయి. ఆహారభద్రత అధికారులు వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
News March 12, 2025
గాజువాకలో వైసీపీ నాయకుడిపై కేసు

వైసీపీ కార్పొరేటర్‌గా పోటీ చేసిన దొడ్డి రమణతో పాటు మరో ముగ్గురు అకారణంగా దూషించి మతిస్థిమితం లేని తన కుమార్తెపై దాడి చేశారని ఓ మహిళ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 64వ వార్డుకు చెందిన దొడ్డి రమణ, మంత్రి మంజుల వెంకటేశ్వరస్వామి దేవస్థానం నిర్వహిస్తున్నారు. దేవాలయంలో హుండీ పోగా.. దార రమణమ్మ కొడుకు దొంగలించాడంటూ గతనెల 28న దాడి చేసినట్లు ఫిర్యాదు చేయడంతో సీఐ పార్థసారథి కేసు దర్యాప్తు చేస్తున్నారు.