News February 15, 2025

కరీంనగర్: ఎక్కడ చూసినా అదే చర్చ

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ వేడెక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News September 18, 2025

BLAను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: చైనా, పాక్

image

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, దాని వింగ్ ‘మజీద్ బ్రిగేడ్’ను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలని UN సెక్యూరిటీ కౌన్సిల్‌లో చైనా, PAK జాయింట్ బిడ్ సబ్మిట్ చేశాయి. AFG అభయారణ్యాల నుంచి ఈ సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరాయి. US గత నెలలో వీటిని విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిందని.. కరాచీ ఎయిర్‌పోర్ట్, జాఫర్ ట్రైన్ హైజాక్‌లో వీటి ప్రమేయం ఉందని తెలిపాయి.

News September 18, 2025

కల్వకుర్తి: బైక్‌లు ఢీకొని ఇద్దరికి గాయాలు

image

కల్వకుర్తి మండలంలో గురువారం ఉదయం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కుర్మిద్ద గ్రామానికి చెందిన ఇద్దరు స్కూటీపై కల్వకుర్తికి వెళ్తుండగా కాటన్ మిల్లు సమీపంలో వేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ లభ్యం

image

తుర్కపల్లి మండలం రుస్తాపురం సమీపంలోని చోక్లా తండాలో తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను పోలీసులు గుర్తించి, వారి తల్లిదండ్రులకు అప్పగించారు. బస్వాపూర్ ప్రాజెక్టు పనుల కోసం మధ్యప్రదేశ్, బిహార్ నుంచి వచ్చిన కూలీల పిల్లలు గురువారం ఉదయం తప్పిపోయారు. తల్లిదండ్రులు తుర్కపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, కొద్దిసేపటికే చిన్నారుల ఆచూకీ గుర్తించారు.