News March 20, 2024
బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్సీ రాజీనామా

TG: బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. మంచిర్యాల జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడం వల్లే ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని చెప్పారు. సతీశ్ కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
Similar News
News April 4, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ మలయాళ నటుడు రవి కుమార్(71) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1968లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవికుమార్ 150కిపైగా మలయాళ, తమిళ చిత్రాలు, అనేక సీరియళ్లలో నటించారు. ‘అనుబంధం’ సీరియల్‌తో పాటు రజినీకాంత్ శివాజీ మూవీలో మినిస్టర్ పాత్రతో తెలుగులోనూ గుర్తింపు పొందారు. ఆయన మృతిపై రాధికా శరత్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
News April 4, 2025
ఒకేసారి ఆస్తి పన్ను చెల్లిస్తే 5% రాయితీ

AP: 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒకేసారి ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. ఈ నెల 30లోగా చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.
News April 4, 2025
టారిఫ్ లిస్టులో పెంగ్విన్ ద్వీపం.. ట్రంప్.. పాపం!

ట్రంప్ టారిఫ్ లిస్ట్ ప్రపంచాన్ని కలవరపెడుతుంటే సోషల్ ప్రపంచం మాత్రం ఆయన్ను ఆడేసుకుంటోంది. ప్రతీకార సుంకాల లిస్టులో ఆస్ట్రేలియా పరిధిలోని మెక్‌డొనాల్డ్ ద్వీపం (అంటార్కిటికా ఖండ ఉపభాగం) కూడా ఉంది. ఈ ద్వీపంలో మనుషులే ఉండరు. పెంగ్విన్లు మాత్రమే నివసించే ఈ ప్రాంతం కూడా 10% దిగుమతి టారిఫ్‌కు గురవడంతో మీమర్స్ బుర్రను షార్ప్ చేసి ట్రంప్‌ను చెక్కేస్తున్నారు. పైన గ్యాలరీలో మీరు కొన్ని మీమ్స్ చూడవచ్చు.