News February 15, 2025

NGKL: ఈ నెల 19వ తేదీ నుంచి 24 గంటలూ అనుమతి

image

నాగర్ కర్నూల్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైల క్షేత్రానికి ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీ శాఖ చెక్ పోస్టులో 24 గంటలూ అనుమతి ఉంటుందని శ్రీశైలం సబ్ DFO అబ్దుల్ రవూఫ్ పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు శ్రీశైలానికి రోడ్డు మార్గంలో ప్రయాణికులను, వాహనాలను అనుమతించరు. పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

Similar News

News February 27, 2026

KNR: రూ.151కే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు

image

భద్రాచల సీతారామయ్య కళ్యాణ తలంబ్రాలను రూ.151/- లకే అందించే పోస్టర్‌ను KNR రీజనల్ ఆఫీస్ కార్యాలయంలో ఆర్టీసీ KNR RM బి.రాజు ఆవిష్కరించారు. ఉమ్మడి KNR జిల్లాకు చెందినవారు రూ.151 చెల్లించి మార్చి 31 వరకు తలంబ్రాలను బుకింగ్ చేసుకోవచ్చని అన్నారు. KNR -9154298561, 9154298581, HZB, HSBD-9154298559, JGTL, MTPY, KRTL-7780250439, SRCL, VMWD – 9154298576, GDK, PDPL, MNTY-9949407275 కు సంప్రదించాలని సూచించారు.

News February 27, 2026

సిరిసిల్ల: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను ఆమె పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. తహశీల్దార్ జయంత్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.

News February 27, 2026

ప.గో జిల్లా కలెక్టర్ ఆగ్రహం

image

ఏకీకృత కుటుంబ సర్వేను శనివారం సాయంత్రానికి వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నిర్వహించిన గూగుల్ మీట్ సమీక్షలో ఆమె మాట్లాడారు. నిరంతరం వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నప్పటికీ, సర్వేలో ఆశించిన ప్రగతి కనిపించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశిత గడువులోగా ప్రక్రియను ముగించాలని స్పష్టం చేశారు.