News February 15, 2025

‘ఛావా’కు రికార్డు కలెక్షన్స్

image

శంభాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ‘ఛావా’ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజు ₹31కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ ఏడాది బాలీవుడ్‌లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ రికార్డు ఇప్పటివరకు అక్షయ్ కుమార్ ‘స్కై ఫోర్స్’ (₹15.30cr) పేరిట ఉండేది. విక్కీ కౌశల్, రష్మిక నటించిన ఈ మూవీని లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు.

Similar News

News April 18, 2026

WGL: రూ.2.5 కోట్ల మోసం.. మిర్చి వ్యాపారి అరెస్ట్

image

ఏనుమాముల మార్కెట్‌లో అడ్తిదారులను మోసం చేసిన మిర్చి వ్యాపారి లడే తిరుపతిని పోలీసులు అరెస్టు చేశారు. గాయత్రి చిల్లీస్ పేరిట వ్యాపారం చేస్తూ 49 మందితో మిర్చి కొనుగోలు చేసి, అదే సరకును ఇతరులకు విక్రయించి సుమారు రూ.2.5 కోట్లతో పరారయ్యాడు. ఈ నెల 2న విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేశారు. దేశాయిపేట వద్ద అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఆయన భార్య మాధవి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

News April 18, 2026

యురేనియం ఇచ్చే ప్రసక్తే లేదు: ఇరాన్

image

శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికీ తరలించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అవి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటాయని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ తెలిపారు. యురేనియంను ఇచ్చేందుకు ఇరాన్ ఒప్పుకుందని అమెరికా అధ్యక్షుడు <<19670282>>ట్రంప్<<>> చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. రెండు దేశాల మధ్య చర్చల్లో ఈ అంశం ఎన్నడూ ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు కేంద్రీకృతమయ్యాయని చెప్పారు.

News April 18, 2026

ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు.. ప్రతిపక్షాలపై పవన్ విమర్శలు

image

LSలో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి చట్టసభల్లో మహిళా శక్తిని పెంపొందించే అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు దూరం చేశాయని AP Dy.CM పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ బిల్లును LS ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను జనసేన స్వాగతించినట్టు చెప్పారు. అయితే ప్రతిపక్షాలు కూడా ఆమోదించి ఉంటే వారికీ గౌరవం దక్కేదన్నారు. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్టసభల్లో సముచిత స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.