News February 15, 2025
కడప: రూ.700 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?

మోదీజీ.. ఢిల్లీలో బీజేపీ కార్యాలయ నిర్మాణానికి రూ.700 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలరా అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి విజయ జ్యోతి డిమాండ్ చేశారు. కమలాపురంలో ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు తేవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి కృషి చేయడం లేదని విమర్శించారు.
Similar News
News January 3, 2026
కడప జిల్లాలో రూ.కోట్ల ఆదాయం.. పూర్తి వివరాలు.!

జిల్లాలో SROల వారీగా DEC. నాటికి డాక్యుమెంట్స్ సంఖ్య, ఆదాయం రూ.కోట్లలో ☞ బద్వేల్ 4537, రూ.10.73 ☞జమ్మలమడుగు 4066, రూ.11.74 ☞కమలాపురం 4290, రూ.9.55 ☞ప్రొద్దుటూరు 10292, రూ.46.20 ☞మైదుకూరు 3320, రూ.7.79 ☞ముద్దనూరు 2509, రూ.3.95 ☞పులివెందుల 4819, రూ.13.26 ☞ సిద్ధవటం 1141, రూ.2.66 ☞ వేంపల్లె 3136, రూ.6.76 ☞ దువ్వూరు 1606, రూ.2.79 ☞ కడప(U) 6820, రూ.50.55 ☞ కడప(R) రూరల్ 8284, రూ.39.39 కోట్లు వచ్చింది.
News January 3, 2026
కడప: ‘10th పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి’

కడప జిల్లా విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి ప్రత్యేక అధికారులు, ప్రధానోపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సభా భవన్‌లో 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై జిల్లా కలెక్టర్ శ్రీధర్, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, డీఈఓ శంషుద్దీన్ కలసి ప్రత్యేక అధికారులు, హెడ్ మాస్టర్లతో సమావేశం నిర్వహించారు.