News February 15, 2025
మెదక్: ఎక్కడ చూసినా అదే చర్చ

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ వేడెక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News January 19, 2026
మెదక్: ‘బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే’

రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీఐఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ డా. అవ్వారు వేణు కుమార్ డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల వాటా, ఆత్మగౌరవం కోసం పోరాడుతామన్నారు. త్వరలోనే మెదక్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి ‘సామాజిక న్యాయ సభ’ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.
News January 19, 2026
మెదక్: 346 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు!

మెదక్ పట్టణంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ జరిగింది. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొని 346 సంఘాలకు రూ. 90.24 లక్షల చెక్కులతో పాటు చీరలను అందజేశారు. మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ రుణాలను చిన్న వ్యాపారాలు, పిల్లల చదువుల కోసం వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
News January 19, 2026
మెదక్: పింఛన్ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు

మెదక్ మండలం రాజ్‌పల్లిలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు తన పింఛన్ డబ్బులు, బంగారం ఇవ్వలేదన్న కోపంతో చాకలి రాములు తన కన్నతల్లి నరసమ్మను కట్టెతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై లింగం సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


