News February 15, 2025
KMR: రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది ఇతడే

సదాశివనగర్ మండలం గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ జాతీయ రహదారి కారు అదుపుతప్పిన ఘటనలో గంగాధర్ (46) అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అతని కూతురు లహరి(20)కి తీవ్రగాయాలయ్యాయి. వీరి స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుక్కునూర్ గ్రామంగా గుర్తించారు. గంగాధర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 17, 2026
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. “వాటర్ – పాజిటివ్ ఆంధ్రా” థీమ్ తో అన్ని గ్రామ పంచాయతీలలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News April 17, 2026
16ఏళ్ల నుంచే రిలేషన్‌షిప్‌లో ఉన్నా: నటి

తాను 16ఏళ్ల వయసు నుంచే రిలేషన్‌షిప్స్‌లో ఉన్నానని ఆలియా భట్ సోదరి, నటి పూజాభట్ వెల్లడించారు. ఇప్పుడు సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని.. విడాకుల తర్వాత స్వేచ్ఛగా బతుకుతున్నానని తెలిపారు. 2003లో మనీశ్ మఖీజాను పెళ్లిచేసుకున్న పూజా భట్ 2014లో డైవర్స్ తీసుకున్నారు. 50+ ఏజ్‌లో జిమ్‌కు వెళ్లడం అలవాటైందని, ఇప్పుడు అది తనకు టెంపుల్‌లాంటిదని అన్నారు. హన్సిక కూడా ఇలాగే <<19671407>>సింగిల్<<>> లైఫ్‌పై కామెంట్స్ చేశారు.
News April 17, 2026
వేసవిలో తాగునీటి కొరతకు చెక్ పెట్టాలి: కలెక్టర్

తాగునీరు, పారిశుద్ధ్య మిషన్ (జల్ జీవన్ మిషన్) కమిటీతో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శుక్రవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. జిల్లాస్థాయి, మండల స్థాయి, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులతో చర్చించారు. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో మంచినీటి కొరత లేకుండా అధికార యంత్రాంగం ముందస్తుగానే చర్యలు తీసుకోవాలన్నారు.


