News February 15, 2025
పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన కలెక్టర్

ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. కరకంబాడి గ్రామ పంచాయతీ తారకరామనగర్‌లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొని ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. చెత్త నుంచి సంపద కేంద్రాన్ని పరిశీలించారు. పలువురు పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారికి కిట్లను పంపిణీ చేశారు.
Similar News
News November 6, 2025
పరకామణి కేసుపై సమగ్ర దర్యాప్తు: రవిశంకర్

AP: తిరుమలలో పరకామణి <<18117294>>చోరీ కేసుపై<<>> హైకోర్టు ఆదేశాలతో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని CID DG రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. ఇప్పటికే పరకామణి భవనం, CCTV కమాండ్ కంట్రోల్ సెంటర్, చోరీ దృశ్యాలను పరిశీలించామన్నారు. నిందితుడు రవికుమార్‌కు తమిళనాడు, కర్ణాటక, HYD, తిరుపతిలో ఆస్తులున్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ కేసుపై DEC 2న హైకోర్టుకు నివేదిస్తామని తెలిపారు.
News November 6, 2025
ఆ కప్పు టీకి భారీ మూల్యం: పాక్ Dy. PM

తాలిబన్స్‌తో ఓ టీ మీట్‌తో భారీ మూల్యం చెల్లిస్తున్నామని పాక్ Dy.PM ఇషాక్ దార్ అన్నారు. 2021లో తాలిబన్లు అధికారం పొందాక ISI మాజీ చీఫ్ హమీద్ ఆ దేశంలో పర్యటించి వారితో టీ తాగుతూ అంతా బాగుంటుందని భరోసా ఇచ్చారని విమర్శించారు. దీంతోనే PAK-AFG బార్డర్స్ తెరుచుకోగా వర్తకులతో పాటు వేలాది తాలిబన్స్ పాక్‌లోకి వచ్చారన్నారు. వారితో పాక్‌లోని మిలిటెంట్ గ్రూప్స్ రీ యాక్టివేట్ అయి తమపై బుసకొడుతున్నాయని వాపోయారు.
News November 6, 2025
బెట్టింగ్ యాప్ కేసు.. రైనా, ధవన్ ఆస్తులు అటాచ్

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్‌కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇలాంటి యాప్‌లకు ప్రచారం చేయడం వెనుక ఏదైనా ఆర్థికపరమైన కుట్ర ఉందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వారిద్దరినీ అధికారులు విచారించారు.


