News February 15, 2025
అక్రమ వలసదారుల తరలింపు.. మాన్‌కు బీజేపీ కౌంటర్

అమెరికా నుంచి వస్తున్న అక్రమ వలసదారుల విమానాలను అమృత్‌సర్‌లో ల్యాండ్ చేసి పంజాబ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని సీఎం భగవంత్ మాన్ చేసిన <<15466008>>వ్యాఖ్యలకు<<>> బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఇలాంటి సున్నితమైన అంశాల్లోనూ రాజకీయం చేయడం తగదని హితవు పలికింది. ఆప్ నేతలు దేశ భద్రతను పట్టించుకోరని, వారికి రాజకీయాలే కావాలని బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ విమర్శించారు.
Similar News
News November 9, 2025
పాడి పశువుల పాలలో కొవ్వు శాతం ఎందుకు తగ్గుతుంది?

గేదె, ఆవు పాలకు మంచి ధర రావాలంటే వాటిలో కొవ్వు శాతం కీలకం. పశువుల వయసు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈత చివరి దశలో సాధారణంగానే పాలలో కొవ్వు శాతం తగ్గుతుంది. పశువులను మరీ ఎక్కువ దూరం నడిపించినా, అవి ఎదలో ఉన్నా, వ్యాధులకు గురైనా, మేతను మార్చినప్పుడు, పచ్చి, ఎండుగడ్డిని సమానంగా ఇవ్వకున్నా పాలలో వెన్నశాతం అనుకున్నంత రాదు.✍️ వెన్నశాతం పెంచే సూచనలకు <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.
News November 9, 2025
వాయుకాలుష్యంతో ఊబకాయ ప్రమాదం

ప్రస్తుతకాలంలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా వాయుకాలుష్యం మహిళల్లో ఊబకాయాన్ని కలిగిస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. డయాబెటీస్ కేర్ జర్నల్ అధ్యయనంలో దీర్ఘకాలం వాయుకాలుష్యానికి గురయ్యే మహిళల్లో అధిక కొవ్వుశాతం, తక్కువ లీన్ మాస్ ఉంటుందని తేలింది. ఊబకాయాన్ని దూరంగా ఉంచేందుకు ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలితో పాటు కాలుష్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
News November 9, 2025
OTTల్లోకి మూడు రోజుల్లో 4 సినిమాలు

ఈ నెల 14-16 వరకు మూడు రోజుల వ్యవధిలో నాలుగు కొత్త సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘తెలుసు కదా’, ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్యూడ్’, ధ్రువ్ విక్రమ్ ‘బైసన్’ మూవీలు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 14న స్ట్రీమింగ్ కానున్నాయి. రష్మిక, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘థామా’ ఈ నెల 16న ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.


