News February 15, 2025
‘విజయ తెలంగాణ’ రాసింది మన మేడ్చల్ మాజీ MLA

మేడ్చల్ అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే తూళ్ల దేవేందర్ గౌడ్ ‘విజయ తెలంగాణ’ పేరుతో పుస్తకం రాశారు. శుక్రవారం స్వయాన సీఎం రేవంత్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా నేను చాలా అభిమానించే నాయకుల్లో దేవేందర్ గౌడ్ అగ్రస్థానంలో ఉంటారని కీర్తించారు.‘విజయ తెలంగాణ ఆయన స్వీయ చరిత్ర కాదు, తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజల కోణంలో పొందుపర్చిన పుస్తకం’ అని అన్నారు.
Similar News
News September 17, 2025
చిత్తూరు: ప్రియురాలి ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య

చిత్తూరులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తవణంపల్లె మండలం దిగువమారేడుపల్లికి చెందిన దేవరాజులు(40) భార్య, పిల్లలను వదిలేసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. 9ఏళ్లుగా గంగన్నపల్లికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఏమైందో ఏమో మంగళవారం సాయంత్రం ఆమె ఇంట్లోనే అతను ఉరేసుకున్నాడు. మొదటి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ నెట్టికంటయ్య తెలిపారు.
News September 17, 2025
రూ.15 వేల ఆర్థికసాయం.. నేటి నుంచే అప్లికేషన్లు

AP: ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అర్హులైన వారు నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రత్యేక <<17731468>>ఫామ్‌లో<<>> వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలి. ఎంపికైన డ్రైవర్ల అకౌంట్లలో అక్టోబర్ 1న ప్రభుత్వం నగదు జమ చేయనుంది.
News September 17, 2025
నంద్యాల: వేధింపులతో భార్య మృతి.. భర్తకు 7ఏళ్ల జైలు శిక్ష

భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తూ, ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన భర్త కనకం కృష్ణయ్యకు నంద్యాల కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లికి చెందిన రాజేశ్వరిని భర్త కనకం కృష్ణయ్య అదనపు కట్నం కోసం వేధించారు. మనస్తాపానికి గురైన ఆమె 2022లో విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.