News February 15, 2025
పార్వతీపురం: ఐఆర్ పీడబ్ల్యూ సంస్థ డైరెక్టర్ ప్రకాశ్ మృతి

పార్వతీపురం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు పెద్దిరెడ్ల ప్రకాశ్ విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మృతికి పట్టణంలో పలువురు సంతాపం తెలిపారు. స్వచ్ఛంద సంస్థ సేవకులుగా ఆయన విజయవంతంగా అనేక కార్యక్రమాలు చేశారని స్థానికులు కొనియాడారు.
Similar News
News January 16, 2026
కరీంనగర్‌కు కనుమ శోభ.. మూగజీవాలకు మొక్కులు

సంక్రాంతి సంబరాల్లో భాగంగా చివరి రోజైన కనుమ పర్వదినాన్ని రైతులు ‘పశువుల పండుగ’గా జరుపుకుంటారు. ఈ క్రమంలో నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులు ఉదయాన్నే ఎద్దులు, ఆవులకు స్నానాలు చేయించారు. అనంతరం కొత్త పగ్గాలు, మెడలో మువ్వల పట్టీలు కట్టి, కొమ్ములకు రంగులు అద్ది అందంగా ముస్తాబు చేసి పూజలు నిర్వహించారు. ఏడాది పొడవునా వ్యవసాయ పనుల్లో తమకు తోడుగా నిలిచే పశువులకు రైతులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
News January 16, 2026
బాపట్ల: వెలుగులోకొచ్చిన 500ఏళ్ల గణపయ్య విగ్రహం!

అద్దంకి మండలం కొత్త రెడ్డిపాలెంలో పురాతన ఉండ్రాళ్ల గణపతి విగ్రహం గురువారం వెలుగులోకి వచ్చింది. కొత్త రెడ్డిపాలెం-చిన్న కొత్తపల్లి గ్రామాల మధ్య ఓ రైతు పొలంలో ఈ విగ్రహం బయటపడింది. పురావస్తు పరిశోధకులు జ్యోతి చంద్రమౌళి విగ్రహాన్ని పరిశీలించి 500 ఏళ్ల నాటి విగ్రహంగా ఆయన పేర్కొన్నారు. ఉండ్రాళ్ల గణపతి విగ్రహానికి గ్రామస్థులు పూజలు చేశారు
News January 16, 2026
కామారెడ్డి జిల్లాలో కొండెక్కిన ధరలు

కామారెడ్డి జిల్లాలో మాంసం ధరలు భగ్గుమంటున్నాయి. సంక్రాంతి ముగింపు వేడుక ‘కనుమ’ సందర్భంగా శుక్రవారం చికెన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. కిలో చికెన్ రూ.300 నుంచి రూ.330 వరకు పలుకుతుండగా, లైవ్ కోడి ధర రూ.210 దాటింది. మటన్ కిలో రూ.800కు చేరింది. పండుగ రద్దీతో పాటు కోళ్ల మేత ధరలు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. సామాన్యులకు మాంసం ప్రియమవడంతో బెంబేలెత్తుతున్నారు.


