News February 15, 2025

NLG: డీసీసీబీ, PACS పదవీకాలం పొడిగింపు

image

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల కాల పరిమితిని ప్రభుత్వం పొడిగించించిన సంగతి తెలిసిందే. మరో ఆరు నెలల పాటు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలే కొనసాగేలా నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి జిల్లాలోని డీసీసీబీతో పాటు 107 పీఏసీఎస్ పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే జిల్లాలోని సహకార సంఘాల చైర్మన్లు కూడా యథావిధిగా కొనసాగుతారు.

Similar News

News January 22, 2026

చెరువుగట్టు జాతర ఏర్పాట్లు పరిశీలించిన Addl కలెక్టర్

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెరువుగట్టు జాతర ఏర్పాట్లను స్థానిక సంస్థల ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి గురువారం పర్యవేక్షించారు. పార్కింగ్ స్థలాలు, క్యూలైన్లు, స్నాన ఘట్టాలు, తాగునీరు, సీసీ కెమెరాల ఏర్పాటును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

News January 22, 2026

నల్గొండలో మొదలైన రాజకీయ సెగలు

image

నల్గొండలో మున్సిపల్ పోరుకు ముందే రాజకీయ క్షేత్రం రగులుతోంది. అధికార ‘హస్తం’లో ఆశావహుల తాకిడి పెరగడంతో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. రెబల్స్ భయం నేతలకు గుబులు పుట్టిస్తోంది. అటు ‘గులాబీ’ దళాన్ని వలసలు వేధిస్తుంటే, ‘కమలం’లో అంతర్గత విభేదాలు శాపంగా మారాయి. స్వతంత్రుల వల్ల ఎవరి ఓట్లు చీలుతాయో చూడాలి. ఓటరు నాడి ఎటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

News January 22, 2026

NLG: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కేతెపల్లి మండలంలోని కొర్లపాడు సమీపంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం పాదచారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. చిత్రంలోని వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే కేతపల్లి ఎస్సై (ఫోన్‌: 8712670180)కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.