News February 15, 2025
రాజాపేట తహశీల్దార్‌కు కుచ్చుటోపి

రాజాపేట తహశీల్దార్‌కి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. పోలీసుల వివరాలిలా.. గుర్తుతెలియని దుండగుడు తహశీల్దార్ దామోదర్‌కు ఫోన్ చేశారు. తాను ఏసీబీ అధికారినని బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. తహశీల్దార్ దామోదర్ ఆన్లైన్లో రూ.3.30 లక్షలు పంపాడు. కాల్ వివరాల ఆధారంగా మోసపోయానని తెలుసుకుని సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 3, 2026
ధవళేశ్వరం: ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు.. గంజాయి నిందితుడికి జైలు

ధవళేశ్వరం ఎర్రకొండకు చెందిన గంజాయి నిందితుడు బహదూర్ రామ్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. ఇతనిపై స్థానికంగానే కాకుండా హైదరాబాద్ చందానగర్లోనూ కేసులు ఉన్నాయని సీఐ టి.గణేశ్ శనివారం వెల్లడించారు. నిందితుడిలో మార్పు రాకపోవడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా ఆదేశాల మేరకు పీటీ యాక్ట్ నమోదు చేశారు. నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News January 3, 2026
ASF: ఈ నెల 6 నుంచి సదరం క్యాంప్

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జనవరి 6 నుంచి 12 వరకు జరిగే సదరం క్యాంపుని దివ్యాంగులు వినియోగించుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శైలేష్ తెలిపారు. సంబంధిత ప్రాథమిక ఆరోగ్య సేవా కేంద్రాల్లో వికలత్వ పరీక్షలు చేయించుకొని, స్లాట్ బుక్ చేసుకున్న వారు క్యాంపునకు హాజరుకావాలని సూచించారు.
News January 3, 2026
గంజాయిని పెంచిపోషిస్తోంది కూటమి నేతలే: YCP

AP: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు HYDలో <<18752425>>గంజాయి<<>> తీసుకుంటూ దొరకడంపై వైసీపీ స్పందించింది. ‘సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపారు. అప్పుడే కేసు రాజీ కోసం ఏపీ నుంచి కూటమి నేతలు రంగంలోకి దిగారు. హోంమంత్రి అనిత తెగ నీతులు చెప్పారు కదా. ఇప్పటికైనా ఒప్పుకుంటారా గంజాయిని పెంచి పోషిస్తోంది మీ కూటమి నేతలేనని?’ అంటూ ప్రశ్నించింది.


