News March 20, 2024

ఘోరం: వివాహితను ప్రేమించాడని..

image

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అమానవీయ ఘటన జరిగింది. వివాహితను ప్రేమించాడని ఓ యువకుడితో కొందరు యూరిన్ తాగించారు. దారుణంగా కొట్టి నాలుకతో షూస్ నాకించారు. అంతటితో ఆగకుండా యువకుడికి సగం గుండు, మీసం తీయించారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన స్థానిక ఏఎస్పీ నితేశ్ భార్గవ బాధితుడి ఇంటికి వెళ్లగా అతడు అందుబాటులో లేడు. త్వరలోనే బాధితుడిని కలిసి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Similar News

News September 10, 2025

సిద్ధార్థ్ మాల్యాతో అందుకే బ్రేకప్: దీపికా పదుకొణె

image

తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్ మాల్యాతో బ్రేకప్‌పై హీరోయిన్ దీపికా పదుకొణె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘సిద్ధార్థ్ బిహేవియర్ దారుణంగా ఉంటుంది. మేం ఇద్దరం కలిసి చివరిసారిగా డిన్నర్‌కు వెళ్లినప్పుడు నన్ను బిల్ పే చేయమన్నాడు. అది నాకెంతో ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత అతడితో రిలేషన్ కొనసాగించడానికి నాకు ఒక్క ఆప్షన్ కూడా కనిపించలేదు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రణ్‌వీర్‌ను దీపిక పెళ్లాడారు.

News September 10, 2025

అగ్రికల్చర్ వర్సిటీలో PG, PhDలో ప్రవేశాలు

image

<>ఆచార్య<<>> NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ PG, PhDలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈనెల 18వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో SEP 22వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్&టెక్నాలజీ విభాగంలో ఉన్నాయి. వెబ్‌సైట్:https://angrau.ac.in/

News September 10, 2025

బిడ్డకు జన్మనిచ్చిన మెగా కపుల్

image

టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మగబిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి మూవీ సెట్ నుంచి ఆస్పత్రికి వెళ్లి వరుణ్, లావణ్యకు విషెస్ తెలిపారు. మెగా ఫ్యాన్స్ వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తేజ్-లావణ్య వివాహం 2023 నవంబర్ 1న ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే.