News March 20, 2024
మదనపల్లె: పెళ్లయిన ఆరు నెలలకే ఆత్మహత్యాయత్నం

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆరు నెలలకే ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. ములకలచెరువు ఇందిరా నగర్లో కాపురం ఉంటున్న వెంకటేశ్ స్థానికంగా ఉన్న శ్రీకళ(20)ని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆమెను మదనపల్లికి తరలించారు.
Similar News
News March 11, 2026
చిత్తూరులో 13న ముస్లింలకు ఇఫ్తార్ విందు

రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు “ఇఫ్తార్ విందు” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి చిన్నారెడ్డి పేర్కొన్నారు. 13వ తేదీ శుక్రవారం 5:30 గం.లకు చిత్తూరు నగరంలోని అగ్నిమాపక కేంద్రం సమీపంలోని ఉర్దూ షాదీ మహల్‌లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ విందు ఏర్పాటు చేశారు.
News March 11, 2026
చిత్తూరు జిల్లా అధికారులు తనిఖీలు చేసేనా?

గ్యాస్ డిమాండ్ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో 46 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో సుమారు 6లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ల పంపిణీని నిలిపివేయడంతో గృహ అవసరాల సిలిండర్లని హోటళ్లకు వినియోగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు గ్యాస్ పక్కదారి పట్టకుండా షాపులపై తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది.
News March 11, 2026
చిత్తూరు: మల్చింగ్ పేపర్ ధరకు రెక్కలు

చిత్తూరు జిల్లాలో పలువురు రైతులు మల్చింగ్ పేపర్‌తో సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. టమాటా సాగులోనూ దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం నేపథ్యంలో ముడి సరుకుల ధర పెరగడంతో మల్చింగ్ ధరకు రెక్కలు వచ్చాయి. గతేడాది ఓ రోల్ రూ.2300 ఉండగా ప్రస్తుతం రూ.3 వేల వరకు విక్రయిస్తున్నారు. అధిక ధరలకు విక్రయించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.


